AP ECET 2024 Couselling: ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు సంబంధించిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26న  ప్రారంభమైంది. ఈసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 26 నుంచి 30 మధ్య రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జూన్ 27 నుంచి జులై 3 మధ్య ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 1 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 5న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు జులై 8న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందినవారు జులై 9 నుంచి 15 మధ్య  సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 10 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 


ఏపీ ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 32,881 మంది (90.41 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో బాలురు 89.35 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 93.34 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.


ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ మాత్రమే ప్రారంభమైంది. అయితే డిప్లొమో ఇన్‌ ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అకడమిక్‌ ప్రక్రియ పూర్తి కానందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.


ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్: 26.06.2024 - 30.06.2024.


➥ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.06.2024 - 03.07.2024.


➥ వెబ్ఆప్షన్ల నమోదు: 01.07.2024 - 04.07.2024.


➥ వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం: 05.07.2024.


➥ సీట్ల కేటాయింపు: 08.07.2024.


➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 09.07.2024 - 15.07.2024.


➥ తరగతులు ప్రారంభం: 10.07.2024.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కావాల్సినవి ఇవే..


➥ పదోతరగతి మార్కుల మెమో


➥ డిప్లొమా/డిగ్రీ మార్కుల మెమో


➥ 7వ తరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్లు (డిప్లొమా వారైతే) లేదా 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికేట్లు (డిగ్రీ వారైతే)


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)


➥ లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (ఫీజ రీయింబెర్స్ అర్హత కోసం)


➥ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్


➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్


➥ రెసిడెన్స్ సర్టిఫికేట్


ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం ఏపీఈసెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే.  అభ్యర్థుల నుంచి మార్చి 15 నంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 8న ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మే 30న ఫలితాలను వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 26న ప్రారంభమైంది.


Counselling Notification


Candidate Registration


Know Your Payment Status


Print Your Application Form


Know Your HLC


Website


ALSO READ: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...