ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌ జులై 24న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 3 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది. అయితే ఆగస్టు 3 నుంచి ప్రారంభంకావాల్సిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఆగస్టు 7కి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ నాగరాణి తెలిపారు. 


తాజా షెడ్యూలు ప్రకారం విద్యార్థులు ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


విద్యార్థులు ఆగస్టు 3 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. 


Website


ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023కు 3,14,797 మంది హాజురు కాగా 2,52,717 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,71, 514 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది అర్హత సాధించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఫీజులకు సంబంధించి కనిష్టంగా 42,500 అంతకంటే ఎక్కువ ఫీజులుంటే 10 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ 2023-24 నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 


కౌన్సెలింగ్ కొత్త షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 24.07.2023 నుంచి 03.08.2023 వరకు. (మార్పులేదు)


➥ ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ కోసం సర్టిఫికెట్ల అప్‌లోడింగ్‌: 25.07.2023 నుంచి 04.08.2023 వరకు. (మార్పులేదు)


➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు: 07.08.2023 నుంచి 12.08.2023 వరకు.


➥ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 13.08.2023.


➥ సీట్ల కేటాయింపు: 17.08.2023.


➥ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌: 18.08.2023 నుంచి 21.08.2023 వరకు.


➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 23.08.2023 నుంచి.


ALSO READ:


తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..