ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న 'ఏపీ ఈఏపీసెట్' 2023 పరీక్ష హాల్‌టికెట్లను మే 9న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్, స్కాన్డ్ కాపీలను అనుమతించరు.
ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055; అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://eamcet.tsche.ac.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Hall Ticket (E & AM)' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో విద్యార్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేయాలి.
➥ అవసరమైన అన్ని వివరాలు నమోదుచేశాకా 'Get Hallticket' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ విద్యార్థి పరీక్ష తేదీ, కేంద్రం వివరాలతో కూడిన హాల్‌టికెట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ హాల్‌టికెట్‌ను ఏ4 సైజు పేజీలో మాత్రమే ప్రింట్ తీసుకోవాలి, కలర్ ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.
➥ ప్రింట్ తీసుకొని పరీక్ష అవసరాలతోపాటు, ఇతర సందర్భాల్లో అవసరానికి భద్రపరచుకోవాలి.
ఏపీఈఏపీసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %), మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి.
ఇంటర్ ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..