AP EAMCET Toppers: ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ ఫలితాల్లో దుమ్ములేపిన అబ్బాయిలు.. టాప్ 10లో 8 ర్యాంకులు వారికే..

ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ ఫలితాల్లోనూ అబ్బాయిల హవా కొనసాగింది. టాప్ 10 ర్యాంకుల్లో 8 కైవసం చేసుకున్నారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) - 2021 అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్) విభాగాల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 78,066 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 72,488 మంది క్వాలిఫై అయ్యారు. ఫలితాల్లో అబ్బాయిల హవా కొనసాగింది. టాప్ 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు విష్ణు వివేక్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. అనంతపూర్ కు చెందిన శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని హన్మకొండకు చెందిన విశ్వాస్ రావు మూడో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన లహరి ఐదో ర్యాంకును దక్కించుకుంది. 

Continues below advertisement

ఈఏపీసెట్‌ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి. 

టాప్ 10 ర్యాంకులు సాధించిన వారి వివరాలు.. 

  1. చెందం విష్ణు వివేక్ (తూర్పు గోదావరి)
  2. రంగు శ్రీనివాస కార్తికేయ (అనంతపూర్)
  3. బొల్లినేని విశ్వాస్ రావు (హన్మకొండ, వరంగల్) 
  4. గజ్జల సమీహన రెడ్డి (హైదరాబాద్) 
  5. కాసా లహరి (హైదరాబాద్) 
  6. కె. చైతన్య కృష్ణ (గుంటూరు) 
  7. నూతలపాటి దివ్య (గుంటూరు) 
  8. కల్యాణం రాహుల్ సిద్ధార్థ్ (సిద్దిపేట)
  9. టి. సాయి రెడ్డి (నల్లగొండ) 
  10. గద్దె విదీప్ (గుంటూరు)

ఈఏపీసెట్ ఫలితాల్లోనూ టాప్ 10 అబ్బాయిలే..
ఏపీలో ఇటీవల విడుదలైన ఈఏపీసెట్‌ - 2021 ఇంజనీరింగ్ విభాగం ఫలితాల్లోనూ అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. 

పాత ఎంసెట్ ఇప్పుడు ఈఏపీసెట్‌గా..
ఇటీవల పాత ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నీట్ (NEET) పరీక్ష నిర్వహిస్తున్నందున ఎంసెట్‌ పేరులో (EAMCET) M అనే అక్షరాన్ని తొలగించారు. ఈ పరీక్ష ద్వారా ఫార్మసీ స్ట్రీమ్ లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నందున M స్థానంలో P అక్షరాన్ని చేర్చి ఈఏపీసెట్‌గా (EAPCET) మార్చారు. 

Also Read: EAPCET Results 2021: ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాల్లో 92.85 శాతం ఉత్తీర్ణత.. ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలు చెక్ చేసుకోండి..

Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

Continues below advertisement