ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 83,822 మంది అప్లై చేసుకోగా.. 78,066 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 72,488 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం 92.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి (సెప్టెంబర్ 15) ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ పరీక్షలకు హాజరైన వారిలో ఏ ఒక్క విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ రాలేదని చెప్పారు.
ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు ఈ నెల 7తో పూర్తయ్యాయి. కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా ఐదు విడతలుగా పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున జేఎన్టీయూ కాకినాడ (JNTUK) ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
ఇంజనీరింగ్ విభాగాల్లో 80.62 శాతం ఉత్తీర్ణత..
ఈ నెల 8న విడుదలైన ఈఏపీసెట్ (పాత ఎంసెట్) ఇంజనీరింగ్ విభాగం ఫలితాల్లో 80.62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది ఉత్తీరులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు అంతకు ముందు రోజు (ఈ నెల 7) నేపథ్యంలో ఫలితాలను ఈ నెల 14న విడుదల చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.
ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- ఈఏపీసెట్ అగ్రి, ఫార్మసీ విభాగాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ వివరాలు ఎంటర్ చేయండి.
- వ్యూ రిజల్ట్ (View Result) ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పరీక్ష ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.
Also Read: AP Degree Colleges Reopen: వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
Also Read: NTA JNUEE Admit Card 2021: జేఎన్‌యూఈఈ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ మీకోసం