School Holidays: మహా శివరాత్రికి వరుసగా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు, ఎన్ని రోజులంటే?

School Holidays In Telangana: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు సెలవులను ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు.

Continues below advertisement

School Holidays In Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు సెలవులను ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం మహాశివరాత్రి (Mahashivratri) ఈ సంవత్సరం మార్చి8వ తేదీన వస్తోంది. అయితే మహాశివరాత్రిని ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరుపుకుంటారు. అయితే ప్రతిసంవత్సరం ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. ఈ సారి కూడ మార్చి 8వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా, ఆ రోజు శుక్రవారం కావడం తర్వాతి రోజు సెకండ్ శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసింది.  

Continues below advertisement

మహాశివరాత్రి అనగా..
ప్రతీ చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి, మార్చ్‌లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. హిందువులు జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. ఈ రోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ఈ పండుగ రోజున ప్రధానంగా బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తారు. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది.  దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది.

ఫిబ్రవరి 8వ తేదీన సెలవు.. 
ఇక ఫిబ్రవరి 8వ తేదీ కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వం ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న తేది గురువారం సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు. తర్వాత రోజు శుక్రవారం మినహా సెకండ్ శనివారం, ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజలు సెలవులు వచ్చాయి.

Continues below advertisement