APOSS SSC, Inter Halltickets: ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు మార్చి 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు. 


పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి..


ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి..


పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..


ఏప్రిల్ 18న: తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం.


➥ ఏప్రిల్ 19న: హిందీ.


➥ ఏప్రిల్ 20న: ఇంగ్లిష్


➥ ఏప్రిల్ 22న: మ్యాథమెటిక్స్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్


➥ ఏప్రిల్ 23న: సైన్స్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్.


➥ ఏప్రిల్ 26న: సోషల్ స్టడీస్, ఎకనామిక్స్.


ఇంటర్ పరీక్షల షెడ్యూలు..


➥ ఏప్రిల్ 18న: హిందీ, తెలుగు, ఉర్దూ.


➥ ఏప్రిల్ 19న: బయాలజీ, కామర్స్, హోంసైన్స్.


➥ ఏప్రిల్ 20న: ఇంగ్లిష్.


➥ ఏప్రిల్ 22న: మ్యాథమెటిక్స్. హిస్టరీ, బిజినెస్ స్టాటిస్టిక్స్.


➥ ఏప్రిల్ 23న: ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్/సివిక్స్, సైకాలజీ.


➥ ఏప్రిల్ 26న: కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ.



ALSO READ:


‘పది’ పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు, ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ఎగ్జామ్ సెంటర్లు, తీసుకెళ్తే సస్పెన్షనే!
తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు హల్‌చల్ చేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్‌ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు. వీరు తమ సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రం వెలుపలే పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌చేస్తారు. పేపర్‌ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.  ప్రక 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగుతాయి.  ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పా టు చేశారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానుండగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.
పరీక్షల పూర్తివివరాలు, హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...