AP Open School SSC, Inter Exam Schedule:  ఏపీలో సార్వత్రిక విద్యాపీఠం(APOSS) పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 వరకు పరీక్షలను  నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి.

విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.25 ఆలస్యరుసుముతో జనవరి 20 నుంచి 27 వరకు, ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుముతో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. అదేవిధంగా తత్కాల్ కింద ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్లు ఫిబ్రవరి 12లోగా విద్యార్థుల నామినల రోల్స్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా డీఈవో కార్యాలయానికి విద్యార్థుల నామినల రోల్స్‌ను ఫిబ్రవరి 14లోగా సమర్పించాల్సి ఉంటుంది.

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 31.08.2023 నాటికి పదోతరతి పరీక్షలకైతే 14 సంవత్సరాలు, ఇంటర్ పరీక్షలకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గత విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొంది, పరీక్షకు హాజరై ఫెయిలైనవారు; పరీక్షకు హాజరుకానివారు పరీక్ష ఫీజు చెల్లించడానికి అర్హులు. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు. 

ఫీజు వివరాలు ఇలా..

➥ పదోతరగతి పరీక్ష ఫీజుగా ఒక్కో థియరీ సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ పరీక్ష ఫీజుగా ఒక్కో థియరీ సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. 

➥ ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు పాసైన సబ్జెక్టుకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసేందుకు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.250, ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలి.

➥ పదోతరగతి విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసేందుకు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.200, ఇంటర్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.300, ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ మార్చి 18న: తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం.

➥ మార్చి 19న: హిందీ.

➥ మార్చి 20న: ఇంగ్లిష్.

➥ మార్చి 22న: మ్యాథమెటిక్స్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్

➥ మార్చి 23న: సైన్స్ అండ్ టెక్నాలజీ, గృహ విజ్ఞాన శాస్త్రం

➥ మార్చి 26న: సోషల్ స్టడీస్, ఎకనామిక్స్.

➥ మార్చి 27న: బిజినెస్ స్టడీస్, సైకాలజీ.

ఇంటర్ పరీక్షల షెడ్యూలు..

➥ మార్చి 18న: హిందీ, తెలుగు, ఉర్దూ.

➥ మార్చి 19న: బయాలజీ, కామర్స్, హోంసైన్స్.

➥ మార్చి 20న: ఇంగ్లిష్.

➥ మార్చి 22న: మ్యాథమెటిక్స్, హిస్టరీ, బిజినెస్ స్టాటిస్టిక్స్.

➥ మార్చి 23న: ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్/సివిక్స్, సైకాలజీ.

➥ మార్చి 26న: కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ.

➥ మార్చి 27న: బిజినెస్ స్టడీస్, సైకాలజీ.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...