Andhra Pradesh Intermediate Education: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కేవలం పరీక్షల్లో పాస్ కావడంపైనే దృష్టి పెట్టకుండా ఓవరాల్ డెవలప్‌మెంట్‌ను కూడా చూస్తోంది. అందుకే కీలకమైన సంస్కరణలు చేపట్టింది. వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తోంది.
విద్యా సంస్కరణలో భాగంగా ఎక్కువ ఇంటర్ విద్యపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ చేశారు. లైఫ్ టర్నింగ్‌గా భావించి ఈ దశలో విద్యతోపాటు స్కిల్‌ను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అందుకే విద్యార్థులపై ఉండే చదువుల భారాన్ని కాస్త తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే సిలబ్‌ను ప్రక్షాళనకు సిద్ధమయ్యారు.
వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యలో చాలా మార్పులు రానున్నాయి. దీని కోసం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశమైంది. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులు గురించి చర్చించారు. ఇకపై ఇంటర్మీడియట్ మ్యాథ్య్ A, మ్యాథ్య్ B అంటూ లేకుండా కలిపి ఒకే సబ్జెక్ట్‌గా మార్చేయనున్నారు. బాటనీ-జువాలజీ కలిపి ఒకే సబ్జెక్ట్‌గా బయోలజీగా విద్యార్థులకు బోధిస్తారు.
జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ అనే కోర్సును కూడా తీసుకురానున్నారు. ఇలా విభిన్నమైన విధానాలతో పోటీ ప్రపంచానికి తగ్గట్టు విద్యార్థులను సిద్ధం చేయబోతున్నారు. ఇప్పట వరకు మార్చి మొదటి వారంలోనే పరీక్షలు ప్రారంభమయ్యేవి. వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.