Vimal's Om Kali Jai Kali Web Series OTT Release On Jio Hotstar: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్‌పై ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో అలాంటి కంటెంట్‌నే ప్రముఖ ఓటీటీలు అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా, మరో రివేంజ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఊరిలో ఓ వైపు జాతర సాగుతుండగా.. మరోవైపు జరిగే వరుస హత్యలతో మిస్టరీ కథాంశంగా రూపొందిన వెబ్ సిరీస్ 'ఓం కాళీ జై కాళీ' (Om Kali Jai Kali).
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
దసరా పండుగ నేపథ్యంలో తెరకెక్కిన రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ 'ఓం కాళీ జై కాళీ'. ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' (Jio Hotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ సదరు ఓటీటీ సంస్థ సిరీస్ తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ, మరాఠీలోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో విమల్, సీమా బిస్వాస్, ఆర్ఎస్ శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు రాము చెల్లప్ప దర్శకత్వం వహించారు.
Also Read: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ట్రైలర్ అదుర్స్
రివేంజ్ థ్రిల్లర్‌గా సాగే ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యతో మొదలైన ట్రైలర్.. వాళ్లను ఓ మహిళ హెచ్చరించడం, ఓ వైపు ఈ కథ నడుస్తుండగానే మరోవైపు ఊరి జాతర జరుగుతుంటుంది. అసలు ఆ ఊరి జాతరకు ఈ మర్డర్స్‌కు ఉన్న సంబంధం ఏంటి..? ఎమ్మెల్యేను ఎవరు మర్డర్ చేశారు.?, వీటి వెనుక ఉన్న మిస్టరీ తెలియాలంటే 'ఓం కాళీ జై కాళీ' సిరీస్ చూడాల్సిందే. గతంలో చట్నీ సాంబార్, పారాచూట్, ఉప్పు పులికారం, గోలీ సోడా రైజింగ్ వంటి తమిళ వెబ్ సీరస్‌లతో ఎంటర్‌టైన్ చేసిన జియో హాట్‌స్టార్ ఈ సిరీస్‌తోనూ ఎంటర్‌టైన్ చేయనుంది. సిరీస్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.