ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవిద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో  8వ తరగతి చదువుతున్న 4 లక్షల 59 వేల 64  (4,59,564) మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వీరితోపాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డిసెంబరు 17న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.


ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందిస్తారు. ప్రభుత్వం రూ.666 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించనున్నారు. రాష్ట్రంలోని 9,703  పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందనున్నారు.


బైజూస్ కంటెంట్‌తో..
➥ ఈ ట్యాబ్‌లలో బైజూస్ ప్రీమియమ్ యాప్‌ ప్రీలోడెడ్‌గా ఉంటుంది. ఇందులో 8, 9వ తరగతులకు సంబంధించిన ఈకంటెంట్‌ను పొందుపరిచారు.


➥ టెక్ట్స్‌బుక్‌లోని చాప్టర్ వారీగా ఈ కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోలజీ, సివిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు ఉండనున్నాయి.


➥ సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా.. అలాగే కాన్సెప్ట్‌లను స్వల్ప వ్యవధి వీడియోలుగా విభజించారు. మొత్తంగా అన్ని కలిపి 57 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లు, 300 వీడియోల వరకు ట్యాబ్‌లలో పొందుపరిచారు. అదేవిధంగా వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన 168 క్వశ్చన్ బ్యాంకులను కూడా ట్యాబ్‌లో ఉంచారు. 


ప్రభుత్వం విడుదల చేసిన జీవో..




మొదట్లో 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే గాడ్జెట్‌లను అందించాలని ప్రతిపాదించగా, ఇప్పుడు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా ఈ సౌకర్యాన్ని కేబినెట్‌ కల్పించింది. ప్రభుత్వం సెప్టెంబర్ 5న విక్రేతతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులకు అందించే 64 జీబీ మెమరీ కార్డ్‌తో కూడిన ప్రతి ట్యాబ్‌ను మార్కెట్ ధర రూ.16,446 ప్రకారం, రూ.13,268కి సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 


సెప్టెంబరులోనే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించినప్పటికీ ఒప్పందం ప్రకారం, విక్రేత ఆర్డర్ చేసిన పరిమాణంలో 50 శాతం 30 రోజుల్లోగా, మిగిలిన మొత్తాన్ని మరో 30 రోజుల్లో డెలివరీ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 9, 10 ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.13,000 'అమ్మ ఒడి' బదులుగా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ల్యాప్‌టాప్‌కు సరఫరాదారులు రూ.24,000 బేస్ ధరను కోట్ చేయడంతో ప్లాన్ రద్దు అయింది. ఇకపై ప్రతి సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ట్యాబ్‌ల ఆలోచన చేసింది. విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం ట్యాబ్‌ల కోసం రూ.666 కోట్లు కానుంది. టెండర్లు ఆలస్యం కారణంగా మెుదట సగం మందికి, ఆ తర్వాత మిగిలిన వారికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. 


Read Also:


ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు!
 ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను నేరుగా వారి ఇళ్లకే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. దరఖాస్తు చేయకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు సర్కారే ఈ సర్టిఫికెట్లను అందించనుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు స్కాలర్ షిప్, మోడల్ స్కూల్లు, వేరే ఇతర పాఠశాల్లో చేరాలన్న చాలా అవసరం. అయితే మాడేళ్ల క్రితం వరకు వీటిని దరఖాస్తు చేసుకోవాలంటే నానా తిప్పలు పడేవారు. పట్టాణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్క ధ్రువీకరణ పత్రానికి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..