AP Government: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను నేరుగా వారి ఇళ్లకే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. దరఖాస్తు చేయకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు సర్కారే ఈ సర్టిఫికెట్లను అందించనుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు స్కాలర్ షిప్, మోడల్ స్కూల్లు, వేరే ఇతర పాఠశాల్లో చేరాలన్న చాలా అవసరం. అయితే మాడేళ్ల క్రితం వరకు వీటిని దరఖాస్తు చేసుకోవాలంటే నానా తిప్పలు పడేవారు. పట్టాణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్క ధ్రువీకరణ పత్రానికి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది. 


సర్టిఫికెట్లను నేరుగా ఇంటికే అందజేస్తున్న ఏపీ సర్కారు


విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకున్న సీఎం జగన్ నేరుగా విద్యార్థుల ఇంటికే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సర్టిఫికెట్ల జారీని ప్రారంభించారు. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేంది. కానీ సర్కారు మరో అడుగు ముందుకేసి పేదలకు ఈమాత్రం కష్టం కూడా కల్గకుండా ఉండేందుకు సర్టిఫికేట్లను ఉచితంగా ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బడులు, జూనియర్ కళాశాలల విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పని చేసే వీఆర్వోల మొబైల్ యాప్ కు అనుసంధానం చేశారు. 


గ్రామ, సచివాలయ శాఖ అధికారులు!


వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని జాబితా ప్రకారం తమ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక స్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ల జారీ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కి నివేదిక ఇస్తారు. ఆర్ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్ కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ అర్హులకు సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్లను సచివాలయాల వారీగా డౌన్ లోడ్ చేస్తారు. వాలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికేట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది. 


ప్రయోజనం పొందనున్న పది లక్షల మంది విద్యార్థులు..


రాష్ట్రంలో ఏటా పదో తరగతిలో ఆరు లక్షల నుంచి 6.5 లక్షల మంది, ఇంటర్ రెండు సంవత్సరాలు దాదాపు 10 లక్షల మంది చదువుతుంటారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది ఎససీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారేనని అధికార వర్గాలు చెప్పాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్దే ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పరిపాలనలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి.