తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ ఎడ్‌సెట్ – 2023' దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ.250 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 30న అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి, మే 21న ప్రాథ‌మిక కీ విడుద‌ల చేయ‌నున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇత‌ర కేట‌గిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.


వివరాలు..


* టీఎస్ ఎడ్‌సెట్ – 2023


అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


వయోపరిమితి:  01.07.2023 నాటికి 19 సంవత్సరాలు నిండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550, ఇత‌ర కేట‌గిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.


పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.


అర్హత మార్కులు: పరీలో అర్హత మార్కులను 25 శాతం(38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు..


➥ TS Ed.CET – 2023 నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.04.2023.


➥ రూ.250 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2023.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.04.2023.


➥ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 05.05.2023.


➥ TS Ed.CET-2023 పరీక్ష తేది: 18.05.2023.


➥ పరీక్ష సమయం: మొదటి సెషన్: 09.00 AM -11.00 AM, రెండో సెషన్: 12.30 PM - 02.30 PM, మూడో సెషన్: 04.00 PM - 06.00 PM


➥ ప్రిలిమినరీ కీ విడుదల: 21.05.2023


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 వరకు.


➥ ఫలితాల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.


Notifications


Information Booklet


Online Application 



Also Read:


టీఎస్‌ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? 
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
లాసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో TS PGECET-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 2 నుంచి 4 మ‌ధ్యలో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.250 ఆల‌స్య రుసుంతో మే 5 వ‌ర‌కు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..