AME Common Entrance Exam 2024– వైమానిక కోర్సుల్లో ప్రవేశాలకు ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా మరియు సర్టిఫికేషన్ కోర్సులు వంటి అనేక ఏవియేషన్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 10వ తరగతి &12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. AIR (ఆల్ ఇండియా ర్యాంక్) ప్రకారం అర్హత పొందిన విద్యార్థులందరికీ 100% స్కాలర్‌షిప్‌ను కూడా అందిస్తంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


⏩ లైసెన్స్ ప్రోగ్రామ్: పైలట్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)), ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ)).


అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత సాధించిన లేదా 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.


⏩ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.


అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథమెటిక్స్ లేదా బయాలజీతో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత సాధించిన లేదా 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.


⏩ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్‌), బీఎస్సీ(ఏఎంఈ)


అర్హత: ఏదైనా స్ట్రీమ్‌లో 12వ తరగతికి హాజరైన లేదా ఉత్తీర్ణత ఉండాలి.


⏩ సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్


అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షకు హాజరవుతూ ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్థులు 14-28 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్కో అభ్యర్థి 3 సార్లు AME CET పరీక్షను రాయవచ్చు. అడ్మిషన్ సమయంలో, ఏవియేషన్ సెక్టార్‌లో అభ్యర్థులు తమ కెరీర్‌ను కొనసాగించడానికి తప్పనిసరిగా 14-28 సంవత్సరాల మధ్య ఉండాలి.


పరీక్ష ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1,200. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.


పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 75 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మొత్తం 300 మార్కులకు జరిగే పరీక్షలో ప్రతి ప్రశ్న 4 మార్కులను కలిగి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.


➥ అడ్మిట్ కార్డుల జారీ: ఏప్రిల్ 2024 చివరి వారం.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: మే 2024 మొదటి వారం.


➥ ఫలితాల వెల్లడి: మే 2024రెండో వారం.


➥ అడ్మిషన్ కౌన్సెలింగ్: మే 2024మూడో వారం.


Notification 


Exam Pattern


Scholarship


Online Application


Website


ALSO READ:


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు 'నిఫ్ట్-2024' నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా
దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...