Dr.B.R.Ambedkar Open University Admissions: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి 2024 సెషన్ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును యూనివర్సిటీ మరోసారి పొడిగించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 29 వరకు అవకాశం కల్పించింది. అయితే రూ.200 ఆలస్యరుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు. 


దీనిద్వారా డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని 22 అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు.


కోర్సుల వివరాలు..


➥ డిగ్రీ కోర్సులు


- బీఏ


- బీకామ్


- బీఎస్సీ


- బీఎల్‌ఐఎస్సీ.


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)


➥ పీజీ కోర్సులు


- ఎంఏ (జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ , ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ)


- ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ)


- ఎంకామ్


- ఎంఎల్ఐఎస్సీ.


➥ డిప్లొమా కోర్సులు


విభాగాలు: సైకలాజికల్ కౌన్సెలింగ్ , ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.


➥ పీజీ డిప్లొమా కోర్సులు


విభాగాలు: మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషనల్ మేనేజ్‌మెంట్.


 సర్టిఫికేట్ కోర్సులు:


విభాగాలు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.


అర్హతలు: 


➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 


➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.


➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.02.2024.


➥ రూ.200 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2024.


Notification


Application Form for BA, BCom & BSc Courses


UG Courses Details


Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate  Programmes


PG, Other Courses Details


Website


ALSO READ:


టీఎస్ ఐసెట్‌-2024 షెడ్యూలు విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2024 ప్రవేశ ప‌రీక్ష షెడ్యూలు విడుద‌లైంది. ఐసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ తాటికొండ ర‌మేశ్‌ ఫిబ్రవరి 10న ఐసెట్ షెడ్యూలును వెల్లడించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5 టీఎస్ ఐసెట్‌-2024 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల కానుంది. మార్చి 7 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  ఎలాంటి ఆల‌స్య రుసుము లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు, రూ.250 ఆల‌స్య రుసుముతో మే 17 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో మే 27 వరకు ద‌ర‌ఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు జూన్ 4, 5 తేదీల్లో కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వహించనున్నారు.
ఐసెట్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..