* మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షల నిర్వహణ


* రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలు


తెలంగాణలో మార్చి 15 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొత్తం 9,51,022 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 9.06 లక్షల, ప్రైవేట్‌ విద్యార్థులు 45 వేలు  ఉన్నారు. 


1,473 పరీక్షా కేంద్రాలు..
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాలేజీ లాగిన్‌ ఐడీలో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగనున్నాయి. ప్రశ్నపత్నాలను తెరవడం.. ఆన్సర్‌షీట్లను నింపే ప్రక్రియనంతా సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.  


ఫీజు చెల్లించని 53 వేల మంది విద్యార్థులు..
ఇంటర్‌లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్‌ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.


ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..




Also Read:


పాలిటెక్నిక్ ఫెయిలైన వాళ్లకు గుడ్ న్యూస్, ఇప్పుడు పరీక్ష రాసి పాస్‌ కావొచ్చు - 1990 నుంచి ఇప్పటిదాకా!
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఇంత వరకు పాస్‌ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సీ శ్రీనాథ్‌ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్‌ 10 చివరితేదీగా నిర్ణయించారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తత్కాల్‌ స్కీం కింద ఎగ్జామ్‌ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ ఐసెట్-2023 షెడ్యూలు విడుదల, పరీక్ష ఎప్పుడంటే!
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి మార్చి 8న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో మే 4 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 11 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  
షెడ్యూలు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..