AIIMS Results: ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో సూపర్ స్పెషాలిటీ (INI-SS-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ) కోర్సుల పరీక్షల(Exams) ఫలితాలను (results)విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 2024 సెషన్‌కు సంబంధించి డీఎం(DM), ఎంసీహెచ్(MCH), ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్(MD Hospital Administration) కోర్సుల ఫలితాలను అందుబాటులో ఉంచింది.


పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నెంబర్లతో ఫలితాలను పొందుపరిచారు.  కోర్సులవారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. డీఎం కోర్సుల్లో 1054 మంది అభ్యర్థులు, ఎంసీహెచ్ కోర్సుల్లో 661 మంది అభ్యర్థులు, ఎండీ కోర్సులో 9 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన పరీక్షలను అక్టోబరు 28న కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎయిమ్స్-న్యూఢిల్లీతోపాటు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్ శాఖలు, జిప్‌మర్(JIPMER) - పుదుచ్చేరి(Puducherry), పీజీఐఎంఈఆర్(PGIMER )- చండిగఢ్(Chandigarh), నిమ్‌హాన్స్(NIMHANS) - బెంగళూరు(Bangalore), ఎస్సీటీఐఎంఎస్‌టీ(SCTIMST)- త్రివేండ్రం(Trivandrum)లో ప్రవేశాలు కల్పిస్తారు.  


అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదుచేసిన అర్హతలు, కేటగిరీ సర్టిఫికేట్, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ మొదలు వివరాల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ఒకవేళ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు తేలితే ప్రవేశాల సమయంలో అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తారు. 


ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి. - aiimsexams.ac.in


➥ అక్కడ హోంపేజీలో 'Results' లేదా 'INI-SS January 2024 Result' లింక్ మీద క్లిక్ చేయాలి.


➥ వెంటనే ఫలితాలు కంప్యూటర్ తెరమీద దర్శమిస్తాయి.


➥ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు. కోర్సులవారీగా అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను అందుబాటులో ఉంచారు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


బీఎస్సీ నర్సింగ్ వెబ్‌ఆప్షన్ల నమోదు, ఎప్పటివరకు అవకాశమంటే?
ఏపీలోని నర్సింగ్ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ఆప్షన్ల నమోదుకు వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా.. చేరని విద్యార్థుల 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గరిష్ఠంగా ఒక్కో అభ్యర్థి ఎన్ని ఆప్షన్లు అయిన నమోదుచేసుకోవచ్చు. ఎలాంటి అవధి లేదు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ చేరని పక్షంలో సీటు కేటాయించరు. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో.. ఇప్పటి వరకు భర్తీ కాని 220 సీట్లు, సీటు కేటాయించినా నిండని 184 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన మూడు కళాశాలల్లో 84 సీట్లు కలిపి, మొత్తం 488 సీట్లు భర్తీ చేయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...