AIBE-XVIII Admit Card: ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)-XVIII పరీక్ష అడ్మిట్ కార్డులను 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష రోజు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు తీసుకువెళ్లా్ల్సి ఉంటుంది. అదిలేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 10న ఏఐబీఈ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి డిసెంబరు 3న పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. క్లాట్(పీజీ)-2024 పరీక్ష కారణంగా డిసెంబరు 10న నిర్వహించనున్నారు.
ఏఐబీఈ-XVIII పరీక్ష అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
Step 1: ఏఐబీఈ అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -https://allindiabarexamination.com/
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'AIBE-XVIII Admit Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు (ఈమెయిల్, పాస్‌వర్డ్) నమోదుచేయాలి.
Step 4: పరీక్ష వివరాలతో ఉన్న అడ్మిట్ కార్డు స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తుంది.
Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
Direct Link: Download Admit Card Here
ఏఐబీఈ-XVIII పరీక్షకు సంబంధించి ఆగస్టు 16 నుంచి నంబరు 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి నవంబరు 17 వరకు ఫీజులు స్వీకరించారు. నవంబరు 19 వరకు దరఖాస్తుల సమరణకు అవకాశం కల్పించారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేశారు. అడ్మిట్ కార్డులో అభ్యర్థులు పరీక్ష రోజు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు చూసుకోవచ్చు. సరిగ్గాలేని అడ్మిట్ కార్డులతో వచ్చేవారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు హార్డ్‌కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిసెంబరు 10న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది.
న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునేవారు రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో ఏడాది తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ నిర్వహించే ఏఐబీఈ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. ఈ ఏడాది డిసెంబరు 10న 5న ఏఐబీఈ-XVIII పరీక్ష నిర్వహించనున్నారు.
ALSO READ:
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక ప్రకటన చేసింది. ఇకపై 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్, డిస్టింక్షన్ ప్రకటించబోమని తెలిపింది. వీటితోపాటు మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని స్పష్టంచేసింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో మార్కుల శాతాన్ని గణించే విధానం గురించి తెలియజేయాలంటూ కొందరు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీబీఎస్‌ఈ ఈ విధంగా స్పందించింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..