గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 2లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
కోర్సు వివరాలు..
బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ). లేదా హోమ్ సైన్స్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 02.09.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar,
Acharya N.G. Ranga Agricultural University,
Administrative Office,
Lam, Guntur - 522 034, A.P.
ALSO READ:
ఆగస్టు 17 నుంచి ఎంసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఎంసెట్-2023 కౌన్సెలింగ్‌లో భాగంగా మూడు విడతల సీట్లకేటాయింపు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. తుదివిడత కౌన్సెలింగ్ తర్వాత రాష్ట్రంలో ఇంకా 19 వేలకు పైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి 'స్పెషల్' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీల్లో చాలా సీట్లు మిగిలిపోయాయి. ఆగస్టు 17 నుంచి 25 వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ జరుగనుంది. ఇప్పటికే స్పెషల్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌ఇన్ కౌన్సెలింగ్
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పాలిసెట్-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS ICET: టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..