ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023' నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మొదటి జాబితాను జూన్‌ 8న, రెండో జాబితాను జూన్‌ 16న, మూడో జాబితాను జూన్‌ 23న ప్రకటించనున్నారు. 


వివరాలు...


* ఏపీఆర్‌ఎస్ క్యాట్-2023


సీట్ల సంఖ్య: 5వ తరగతి-3920 సీట్లు. 6-8వ తరగతులు-356 సీట్లు ఉన్నాయి.


అర్హతలు..


* 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2022-23 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2012 - 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.


* 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2021-22 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2011 - 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.


* 7వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2010 - 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.


* 8వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2009 - 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య జన్మించి ఉండాలి.


* జనరల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఓసీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్, మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశం కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చు.


* తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఆదాయ పరిమితి వర్తించదు.


దరఖాస్తు ఫీజు: రూ.100. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ వెల్లడి: 04.04.2023.


* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 04.04.2023.


*  ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 24.04.2023 


*  హాల్‌టికెట్ల విడుదల: 12.05.2023 


*  పరీక్ష తేది: 20.05.2023. (10.30 AM to 12 PM)


*  ఫలితాల వెల్లడి: 08.06.2023.


Notificaion


APRS CAT - 2023 PROSPECTUS


Online Application


Website


Also Read:


తెలంగాణలో నేడు హిందీ పేపర్ లీక్ - కాసేపటికే వాట్సప్‌లో చక్కర్లు!
తెలంగాణలో పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.  SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మిగతా 'పది' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి!
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠ‌శాల‌-1లో సోమ‌వారం ఉద‌యం తెలుగు ప్రశ్నాప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 4న జరిగే ప‌రీక్ష వాయిదా వేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల‌పై రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డ‌లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వ‌ర‌కు అన్ని ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాప‌త్రాన్ని వాట్సాప్ ద్వారా బ‌య‌ట‌కు పంపిన వ్యవ‌హారంలో న‌లుగురు ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ‌సేన ప్రక‌టించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..