తెలంగాణలోని మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో 35 శాతం 30 కళాశాలల్లోనే ఉన్నాయి. అది కూడా హైదరాబాద్ పరిసరాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీలో వెయ్యికి పైగా సీట్లున్న కళాశాలల సంఖ్య 30కి చేరింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 10 కళాశాలలు 1000 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో భారత్, సీవీఆర్, గీతాంజలి, ఏస్ తదితర పలు కళాశాలలున్నాయి. రాష్ట్రంలో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి మొత్తం 176 కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా... ఈ 30 ప్రైవేట్ కళాశాలల్లోనే 37,842 సీట్లున్నాయి. ఇది 35.35 శాతంతో సమానం. ఈ కళాశాలల్లో కేవలం ఒక్కటి మాత్రమే గ్రామీణ జిల్లాల్లో ఉండగా...మిగిలిన 29 హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి.


గతేడాది వరకు సీవీఆర్ కళాశాలలో తొమ్మిది కోర్సులు ఉండగా...ఈసారి వాటి సంఖ్యకు 12కు పెరిగింది. గత ఏడాది అక్కడ మొత్తం 960 సీట్లుంటే ఈసారి 1,560కి పెరిగాయి. అక్కడ ఒక్క సీఎస్‌ఈ బ్రాంచీలోనే 600 సీట్లు (10 సెక్షన్లు) ఉండడం గమనార్హం. ఒక బ్రాంచీలో అత్యధిక సెక్షన్లు ఉన్న కళాశాల ఇదే. బీవీఆర్ ఐటీలో గత సంవత్సరం వరకు 1,320 ఉండగా...ఈసారి 1,512కు పెరిగాయి. సీఎంఆర్ యాజమాన్యం కింద నాలుగు కళాశాలలు ఉండగా...అన్నిట్లో సీట్లు వెయ్యికి మించాయి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో 1,230 నుంచి 1,530కి...అంటే 300 సీట్లు ఒకేసారి పెరిగాయి. ఇలా దాదాపు 30 కళాశాలల్లో ఈసారి సీట్లు అధికంగా పెరిగాయి. అవన్నీ హైదరాబాద్, చుట్టుపక్కల కళాశాలలే కావడంతో ఈసారి గ్రామీణ జిల్లాల్లోని కళాశాలల సీట్ల భర్తీపై తీవ్ర ప్రభావం పడవచ్చని అంచనా వేస్తున్నారు.


కొన్ని యాజమాన్యాల కింద పలు కళాశాలలు ఉన్నందున వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు సీఎంఆర్, మల్లారెడ్డి పేరిట పలు కళాశాలలు ఉన్నందున కళాశాల ప్రాంతం, ఏర్పాటు చేసిన సంవత్సరం, యూజీసీ స్వయంప్రతిపత్తి ఉందా? ఏ బ్రాంచీకి ఎన్‌బీఏ గుర్తింపు ఉంది? తదితర వివరాలను క్షుణ్నంగా గమనించడంతోపాటు పాత విద్యార్థులను, అధ్యాపకుల సలహా మేరకు ప్రాధాన్యం వారీగా ఆప్షన్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆప్షన్ల నమోదుకు ఈనెల 12వ తేదీ వరకు గడువుంది.



తెలంగాణలోని టాప్ - 10 ఇంజినీరింగ్ కళాశాలలు..
అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, ప్లేస్ మెంట్ ఉద్యోగాలు కల్పించే ఉత్తమమైన తెలంగాణలోని టాప్ - 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాప్ కాలేజీల్లో చదివిన వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


1. మహీంద్రా యూనివర్సిటీ - హైదరాబాద్
మహీంద్రా యూనివర్సిటీని ఇటీవలే ప్రారంభించారు. ఎన్ఐఆర్ఎఫ్ లో ఈ యూనివర్సిటీ 154వ ర్యాంకు సాధించింది. యూపీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అందించే ఈ ఇంజినీరింగ్ కళాశాలలో మేనేజ్ మెంట్, డిజైన్, న్యాయశాస్త్రానికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 


2. సీఆర్ఆర్ఆర్ఐటీ - హైదరాబాద్
గోకరాజు రంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరంగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల. ఎన్ఐఆర్ఎఫ్ లో ఇది 148వ స్థానాన్ని దక్కించుకుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తుంది. జేఎన్టీయూకి అఫిలియేటెడ్ గా కొనసాగుతోంది ఈ కాలేజీ.


3. అనురాగ్ యూనివర్సిటీ - హైదరాబాద్
అనురాగ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీలో ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, కంప్యూటర్ అప్లికేషన్లకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ 140వ ర్యాంకు ఇచ్చింది. 


4. యూసీఈ - హైదరాబాద్
హైదరాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఎన్ఐఆర్ఎఫ్ లో 117వ ర్యాంకును పొందింది. ఉస్మానియా వర్సిటీ కింద ఈ కాలేజీ కొనసాగుతోంది. రీసెర్చ్, ఇన్నోవేషన్, కంపెనీలతో అనుసంధానమై పాఠాలు బోధిస్తుంది. 


5. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల
వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ హైదరాబాద్ జేఎన్టీయూ వర్సిటీకి అఫిలియేట్‌గా కొనసాగుతోంది. ఈ విద్యాసంస్థకు ఎన్ఐఆర్ఎఫ్ లో 113వ ర్యాంకు వచ్చింది.


6. ఎస్ఆర్ యూనివర్సిటీ - వరంగల్
ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. డాక్టర్ ప్రోగ్రాములను అందిస్తోంది. ఈ సంస్థకు ఎన్ఐఆర్ఎఫ్ లో 91వ ర్యాంకు వచ్చింది. 


7. జేఎన్టీయూ - హైదరాబాద్
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 76వ స్థానంలో నిలిచింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అందులోబాటులో ఉన్నాయి. 


8. ఐఐఐటీ - హైదరాబాద్
ఐఐఐటీ హైదరాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 62వ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత వర్సిటీలలో ఇదీ ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ ఎడ్యుకేషన్ పై ప్రధానంగా దృష్టి పెడుతుంది. కంప్యూర్ సైన్స్, కృత్రిమ మేధ వంటి అధునాత టెక్నాలజీలపై ఫోకస్ పెడుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 62వ స్థానంలో నిలిచింది.


9. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వరంగల్
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్- వరంగల్ రాష్ట్రంలో ప్రఖ్యాత వర్సిటీల్లో ఒకటి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 21వ స్థానంలో నిలిచింది.


10. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్   
ఐఐటీ హైదరాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత వర్సిటీలలో ఇదీ ఒకటి. కంప్యూర్ సైన్స్, కృత్రిమ మేధ వంటి అధునాత టెక్నాలజీలపై ఫోకస్ పెడుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో నిలిచింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial