తెలుగు రాష్ట్రాల్లో 14 వైద్య కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 9 కాలేజీలను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. 


తెలంగాణ సచివాలయం నుంచి వర్చువల్‌గా 9 కాలేజీలను కేసీఆర్‌ స్టార్ చేశారు. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 


ఆంధ్రప్రదేశ్‌లో  ఐదు వైద్య కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి... మొదట అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్‌గా రాజమండ్రి, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కూడా కళాశాలలు ప్రారంభించారు.