అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.
అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల వివరాలు..
1) డిగ్రీ కోర్సులు
- బీఏ
- బీకామ్
- బీఎస్సీ
- బీఎల్‌ఐఎస్సీ.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)
2) పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంఏ(జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ.
3) డిప్లొమా కోర్సులు: సైకలాజికల్ కౌన్సెలింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.
4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.
అర్హతలు:
➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే.
➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.
➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Application Form for BA, BCom & BSc Courses
Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate Programmes
ALSO READ:
TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబరు 19న విడుదల చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివరాలను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు నమోదు చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీకోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన 'టీఎస్ పీఈసెట్-2023' ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమంట్ ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి 25 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..