తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు జులై 6న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అలాగే, పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ పలు మార్పులు చేసింది. జులై 7న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల సంఖ్య పెరగడంతో ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేసింది.
మారిన షెడ్యూల్ ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 10న పాలిసెట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. జులై 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇక జులై 14న తుది విడత పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.
ALSO READ:
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలు ఇలా!
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. జులై 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జులై 12 వరకు పొడిగించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా జులై 21 నుంచి ప్రారంభంకావాల్సిన రెండోవిడత కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభంకానుంది. ఇక ఆగస్టు 2 నుంచి ప్రారంభంకావాల్సిన తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి మొదలుకానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..
పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్ విధానం! నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పాలిసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి స్లైడింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial