నగరంలో విషాదం నెలకొంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.


 పోలీసుల కథనం ప్రకారం… పాండిచ్చేరికి చెందిన శర్వణప్రియ నగరంలో ఉంటూ హెటీరో ఫార్మసీలో పనిచేస్తోంది. ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నైకి చెందిన శ్రీహరి మంగళవారం చెన్నై నుంచి యువతిని కలిసేందుకు హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి వచ్చాడు. ఇద్దరు కలిసి మాదాపూర్‌లోని చంద్రునాయక్ తండాలోని ఓయోలో రాత్రి 9 గంటలకు రూమ్ తీసుకున్నారు. ఇద్దరు హోటల్‌లో మద్యం సేవించారు. తర్వాత శ్రీహరి  వాంతులు ఫుడ్ పాయిజన్ కావడంతో చాలాసార్లు వాంతులు చేసుకున్నాడు.


వాంతులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 2 గంటలకు శ్రీహరి మాదాపూర్‌లోని శ్రావణి ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు, మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ఓయో రూమ్‌కు వచ్చి చూసేసరికి రూమ్‌లో శ్వరణప్రియ కింద కూర్చుని ఉంది. పిలిచినా స్పందింకపోవడంతో కదిలించేసరికి కిందపడిపోయింది. వెంటనే హోటల్ సిబ్బంది సాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి శర్వాణిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.


రాత్రి 10.49 గంటల సమయంలో శర్వాణి రిసెప్షనిస్టుకు ఫోన్ చేసి గదిని పొడిగించాలనుకుంటున్నట్లు చెప్పారని హోటల్ సిబ్బంది చెప్పారు. తర్వాత జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిందని, దానిని అందించేందుకు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మద్యం బాటిల్స్, ఫుడ్ శాంపిల్స్ పలు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా ఐపీసీ సెక్షన్‌ 174 కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


యువతీ మృతితో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇద్దరు కలిసి మద్యం సేవించాల్సిన అవసరం ఏమిటి? తదితర వివరాలు శ్రీహరి  నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ శ్రీహరి  ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరి కొలుకుంటే పూర్తి వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతి పై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. 


హోటల్ సిబ్బందిని, స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. మద్యపానియంలో వీరు ఏమైనా విష పదార్థాలను సేవించారు? అసలు ఏం జరిగింది? రమేష్ ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి యువతి వద్దకు ఇంకెవరైనా వెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకొని, అందులోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వీరు చివరిగా ఎవరితో మాట్లాడారు. ఎవరెవరిని కలిశారు అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. రమేష్ కోలుకుంటే మరిన్ని వివరాలు ఆయన నుంచి రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని, అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.