తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ 11 రోజులపాటు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అక్టోబర్ 14 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వెల్లడించింది. ఓయూ క్యాంపస్‌తోపాటు.. యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకుసెలవులు ఉంటాయని ప్రకటించింది. కాలేజీలన్నీ తిరిగి అక్టోబర్ 25న ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.


మరోవైపు దసరా, బతుకమ్మ పండగలను పురస్కరించుకుని ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటన వెలువరించింది. అంతేకాకుండా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


జూనియర్ కాలేజీలకు వారం సెలవులు..
తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఈసారి ఇంటర్ కాలేజీలకు వారంపాటు సెలవులు రానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి 25 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. తిరిగి అక్టోబరు 26న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది. 


పాఠశాలలకు 13 రోజులపాటు దసరా సెలవులు..
ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.


ALSO READ:


'ఆయుష్‌' పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 17 వరకు దరఖాస్తుకు అవకాశం
తెలంగాణలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అక్టోబరు 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2023 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో అక్టోబరు 11న ఉదయం 9 గంటల నుంచి అక్టోబరు 17న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...