Woman Murdered In LB Nagar: హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ నగర్ పరిధిలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళ మరో మహిళపై దాడి చేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివగంగా కాలనీలో సరోజినీ, నరసమ్మ అనే ఇద్దరు మహిళలు పక్క పక్క ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నర్సమ్మ.. సరోజిని వద్ద రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఈ నగదును తిరిగి చెల్లించాలని సరోజిని నర్సమ్మను అడిగింది. శుక్రవారం రాత్రి ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంతో సరోజిని.. నరసమ్మ ముఖంపై సుత్తితో దాడి చేసింది. దీంతో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు సరోజినిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Road Accident: ఘోర ప్రమాదం - ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొన్న బైక్, ముగ్గురి యువకుల తలలు పగిలి స్పాట్‌లోనే దుర్మరణం