Mobile Phone Murder :   ఆ అత్తగారికి సలహాలివ్వడం ప్రాణం మీదకు వస్తుందని .. తెస్తుందని తెలియలేదు. తెలిస్తే ఆ పని చేసి ఉండేది కాదు. సొంత కోడలే కదా అస్తమానం అలా ఫోన్‌లో మాట్లాడకపోతే ఇంటి పనులు..  సరిగ్గా చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చింది. అలాంటి సలహాలిస్తే చంపేస్తానని ఆ కోడలు మనసులోనే అనుకోలేదు..నిజంగానే చేసి చూపించింది. అత్తగార్ని చంపేసింది. 


మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ బర్మన్ భార్య, తల్లితో కలిసి నివాసం ఉంటాడు. ప్రైవేటు ఉద్యోగం చేసే అజయ్ నైన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళ్తారు. అలా ఓ సారి ఆఫీసుకు వెళ్లినప్పుడు అతని భార్య ఫోన్ చేసింది. మీ అమ్మగారు..అంటే అమె అత్తగారన్నమాట..  బాయటకు వెళ్లారని.. దెబ్బలు తగిలిన గాయాలతో తిరిగి వచ్చారని త్వరగా రావాలని కంగారు పెట్టింది. అజయ్ వచ్చే సరికి తల్లి అచేతనంగా పడి ఉంది. ఒంటిపై కొన్ని గాయాలున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని తేల్చారు. కానీ మెడికో లీగల్ కేసు కాబట్టి ఎలా చనిపోయిందో తేల్చాల్సి వచ్చింది. పోలీసులు వచ్చారు. 


అప్పులు ఎక్కువయ్యానని బాలుడి కిడ్నాప్ కలకలం - 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులకు హ్యాట్సాఫ్


అయితే పోలీసులు కాస్త విచారణ చేసిన తర్వాత ఆమె ఎక్కడికీ బయటకు వెళ్లలేదని తేలింది. మరి గాయాలు ఎలా అయ్యాయి అని ఆరా తీస్తే అసలు విషయం  బయటపడింది. కోడలే కొట్టిందని తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చస్తే అసలు విషయం అంగీకరించింది. తానే హత్య చేశానని చెప్పింది. అదే ఎందుకు ? పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. అప్పుడు అసలు విషయం కనిపెట్టారు. అదేమిటంటే ఏ వివాహేతర బంధమో కానీ.. అస్తమానం ఫోన్ వాడుతుందని.. వాడొద్దని  ఆ అత్తగారు పోరు పెట్టారట. అందుకే చంపేసిందట. 


యువకుడి హత్య కేసులో నమ్మలేని నిజం - అతని ఫ్యామిలీ మొత్తం అవాక్కు!


స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక ఖాళీగా ఉన్నా.., పనులు చేస్తున్న ఫోన్లలో వీడియోలు చూడటమో.. ఎవరితోనైనా చాటింగ్ చేయడమో... కబుర్లు చెప్పడమో కామన్ అయిపోయింది. పాత తరం వాళ్లకి ఇవి అసలు నచ్చవు. అందుకే ఫోన్లు పక్కన పెట్టేయమంటారు. వారికి గౌరవంఇచ్చినా ఇవ్వకపోయినా అలా ఫోన్ వాడకూడదని సలహా ఇచ్చినంత మాత్రాన చంపేయకూడదు కదా అని పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పట్టుకెళ్లిపోయారు.  పాపం అజయ్ తల్లి చనిపోయింది.. భార్య జైలుకెళ్లిపోయింది. తాను ఒంటరైపోయాడు.