Woman killed husband: భర్తలను దారుణంగా చంపేస్తున్న భార్యల గురించి కథనాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో ఘోరం జరిగింది.  రాజస్థాన్‌లోని ఖైర్‌థల్-తిజారా జిల్లాలోని కిషన్‌గఢ్‌బాస్‌లో ఆగస్టు 17, 2025న ఒక దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ కాలనీలో ఒక అద్దె ఇంటి పైకప్పు మీద నీలం రంగు డ్రమ్‌లో హన్స్‌రామ్  అనే వ్యక్తి మృతదేహం  బయటపడింది.  అతన్ని అతని భార్య.. తన ప్రియుడితో కలిసి చంపేసినట్లుగా గుర్తించారు.                      హన్స్‌రామ్, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని నవాడియా నవాజ్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, కిషన్‌గఢ్‌బాస్ ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. అతను దాదాపు ఒకటిన్నర నెలల క్రితం తన భార్య లక్ష్మి దేవి ,  ముగ్గురు పిల్లలతో కలిసి రాజేష్ షర్మ అనే వ్యక్తి ఇంటిలో అద్దెకు దిగారు.  ఆగస్టు 17న, ఇంటి యజమాని అయిన మిథిలేష్  పైకి వెళ్లినప్పుడు తీవ్రమైన దుర్వాసన గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, పైకప్పుపై ఉన్న నీలం రంగు డ్రమ్‌ను తెరిచి చూడగా, హన్స్‌రామ్ మృతదేహం బయటపడింది. డ్రమ్‌పై ఒక పెద్ద రాయి ఉంచారు. మృతదేహంపై ఉప్పు చల్లారు. శరీరం కుళ్ళిపోకుండా ఉండటానికి వాడారు.  మృతదేహంపై గొంతు భాగంలో ఒక పదునైన ఆయుధంతో  చేసి  గాయం ఉంది.   హన్స్‌రామ్ భార్య లక్ష్మి దేవి ,  ఇంటి యజమాని కుమారుడు జితేంద్ర హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఇద్దరూ సంఘటన తర్వాత నుండి తప్పించుకుని తిరుగుతున్నారు.  నాలుగు పోలీసు బృందాలు రాజస్థాన్, హర్యానా,   ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో  నిందితుల కోసం గాలించారు. ప్రాథమిక విచారణలో, ఈ హత్య వెనుక అక్రమ సంబంధం ఒక కారణంగా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హన్స్‌రామ్ మద్యపానానికి బానిస అని, జితేంద్రతో తరచూ కలిసి మద్యం సేవించేవాడని గుర్తించారు.                  

విశేషం ఏమిటంటే..  ఆ బ్లూడ్రమ్ము కూడా ఇంటి ఓనర్ దగ్గరే తీసుకున్నారు.  హన్స్‌రామ్ భార్య సునీతా  ఒక వారం లేదా ఎనిమిది రోజుల క్రితం తమ వద్ద నీలం రంగు డ్రమ్ నీటిని నిల్వ చేయడానికి అవసరమని చెప్పి తీసుకుందని ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు.  కానీ దానిని హత్య కుట్రలో ఉపయోగించారని తెలియదని  ఆయన అన్నారు.  కుమారుడు జితేంద్ర, హన్స్‌రామ్ స్నేహితుల్లా ఉండేవారని, కలిసి తినడం, తాగడం చేసేవారని ఆమె చెప్పారు 

మీరట్‌లో మార్చి 2025లో జరిగిన సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు లో, సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్ రాస్తోగి ,  ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి, సిమెంట్‌తో నింపిన డ్రమ్‌లో దాచారు. ఈ కేసు వారి కూతురు "పాపా డ్రమ్‌లో ఉన్నారు" అని పొరపాటున చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసు రాజస్థాన్‌లో సంచలనం సృష్టించింది.