Woman killed her husband : భర్త నిద్రలో చనిపోయాడని ఆ భార్య తెల్లవారుజామున గగ్గోలు పెట్టి ఏడిస్తే తోటి కార్మికులు అంతా నిజమే అనుకున్నారు. తలా కొంత చందాలేసుకుని సొంత ఊరికి అంబులెన్స్ మాట్లాడి పంపించారు. చివరికి అదే ఆమె గుట్టు రట్టు చేసేలా చేసింది. 

మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన అంజిలప్ప, 2014 సంవత్సరంలో రాధ అనే మహిళని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.   భార్యాభర్తలు ఇరువురు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబైలలో కూలి పని చేస్తూ ఉండేవారు.  కొద్ది నెలల క్రితం దంపతులు బాచుపల్లి లోని ప్రతీక్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ వారి ప్రాజెక్టులో కూలీలుగా చేశారు. అంజిలప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగినప్పుడల్లా భార్యను వేధించేవాడు. అదే సమయంలో తన భార్య వేరే వారితో వివాహేతర బంధం పెట్టుకుదంని అనుమానించేవాడు. శారీరకంగా హింసించేవాడు.                        

గత నెల 22వ తేదీన రాత్రి అంజిలప్ప మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు.  ఎప్పట్లాగే చేయి చేసుకోవడంతో  భార్య రాధ హత్య చేయాలని  నిర్ణయించుకుంది. మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో  గొంతు నిలిమి హత్య చేసింది. 23వ తేదీ ఉదయం తన భర్త సహజంగానే మరణించాడని తాను పనిచేస్తున్న చోట కార్మికుల నమ్మించింది. మద్యానికి  బానిక కావడంతో ఎక్కువగా తాగడంతో.. గుండెపోటు వచ్చి ఉంటుందని తోటి కార్మికులు ఆస్పత్రికి కూడా పంపించకుండా.. ఇంటికి  పంపించే ఏర్పాట్లు  చేశారు.  అంత్యక్రియలు నిమిత్తం అంజిలప్ప స్వగ్రామానికి తరలించింది. స్వగ్రామంలో అంజిలప్ప గొంతుపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చింది.                  

ఏదో జరిగిందన్న  అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిర్వహించారు.  అంజిలప్పను హత్య చేసినట్లుగా గుర్తించారు.  ఎఫ్ఐఆర్ ను బాచుపల్లి పోలీసులకు బదిలీ చేశారు.  బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకొని విచారించటంతో ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది.  పోలీసులు కోర్టులో అమైను హాజరు పరిచి రిమైండుకు తరలించినట్లు బాచుపల్లి సీఐ ఉపేందర్ తెలిపారు.                    

అయితే ఈ హత్యకు .. కేవలం మద్యం తాగి వచ్చి చేసే వేధింపులేనా.. వివాహేతర బంధం ఏమైనా కారణామా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు.   హంతకురాలి ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటాతో పాటు పని చేసే వారి దగ్గర ఆరా తీస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా  ప్రియుడితో గడపడానికి అడ్డు వస్తున్నాడని భర్తల్ని చంపిన భార్యల ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.