New UIDAI Rules 2025: ఆధార్‌ కార్డు ఉన్న వాళ్లకు, ఆధార్‌ ఇంకా చేయించుకోని వాళ్లకు ఇది బిగ్ అలర్ట్. ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పుల టైంలో కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది UIDAI. ఇవి తెలుసుకోకుంటే మీ ఆధార్‌ కార్డు అప్‌డేట్ కాకపోవచ్చు లేదా రాకపోవచ్చు.   

ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి?ప్రస్తుతం భారత్‌లో ఉన్న పౌరులకు, భారత్‌లో ఉన్న విదేశీ పౌరులకు, ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న చిన్నారులకు, దీర్ఘకాలిక వీసాపై ఉన్న విదేశీ పౌరులకు ఈ రూల్స్ వర్తిస్తాయి. గుర్తింపును, చిరునామా, పుట్టిన తేదీ లాంటి వివరాల కోసం సమర్పించే పత్రాల విషయంలో కొన్ని కీలక మార్పులు చేసింది UIDAI. 

భారత్‌లో ఉన్న పౌరులు అయితే పాన్ కార్డులు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌, రేషన్ కార్డులు, పెన్షనర్ ఫొటో ఐదీ కార్డు, బ్యాంకు పాస్ బుక్‌లను ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు ఉన్న సరిపోతుంది. ఈ పాస్‌పోర్టు భారతీయ పౌరులతోపాటు మూడు వర్గాల వారికి ప్రూఫ్‌గా చూపించవచ్చు. 

ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌ కార్డులు ఉంటే?వివిధ కారణాలతో కొందరు ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులు పొంది ఉన్నారు. అలాంటి వారి విషయంలో కూడా UIDAI క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి ఎన్ని ఆధార్‌లు పొందినప్పటికీ బయోమెట్రిక్‌ సమాచారం కలిగి ఉన్న మొదటి ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుందని మిగతావి రద్దు అవుతాయని ప్రకటించింది. 

భారత్‌లో ఉండే విదేశీ పౌరులకు ప్రత్యేక డాక్యుమెంటేషన్చాలా మంది విదేశీ పౌరసత్వం ఉన్న వాళ్లు వివిధ కారణాలతో భారత్‌లో ఉంటున్నారు. భారత్‌ పౌరుసత్వం కలిగిన వారి వారసులు, ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉండే వాళ్లు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లకు కొన్ని వెసులుబాటులు ఇస్తారు. అలాంటి వారికి కూడా ఇక్కడ విద్య, ఉద్యోగం, వైద్యం పొందే అర్హత ఉంటుంది. అందుకే వారికి ఆధార్ కార్డు కావాలి. ఇలా భారత్‌లో ఉండే విదేశీయులు(OCI), దీర్ఘకాలిక వీసా హోల్డర్లు(LTV ), నేపాల్, భూటాన్ పౌరులు ఆధార్ కార్డు పొందాలంటే ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. విదేశీ పాస్‌పోర్ట్‌లు, వీసాలు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) జారీ చేసిన నివాస అనుమతులు చూపించి ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

పదోతరగతి ఉత్తీర్ణులైన వారి పేరు, జెండర్, పుట్టిన తేదీలు మార్చుకోవడం కొంత సులభమే కానీ అవి లేని వారి పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందే. అందుకే ఇలాంటి వారికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. పేరు, జెండర్‌, పుట్టిన తేదీ అప్‌డేట్ చేయాలి అంటే మెడికల్ సర్టిఫికెట్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో కూడిన సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దేని కోసం ఏ డాక్యుమెంట్ యూజ్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి 

5 ఏళ్లు వయస్సు గల పిల్లల ఆధార్ నమోదుకు కావాల్సిన డాక్యుమెంట్స్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆధార్‌ను కుటుంబ పెద్ద ఆధార్‌ లేదా ఇతర పత్రాలను బేస్ చేసుకొని రిజిస్టర్ చేస్తారు.

కుటుంబ పెద్ద(HoF) ఆధార్‌తో నమోదు చేస్తే 

Sl NO అవసరమైన పత్రాలు  రిలేషన్ తెలియజేసే ప్రూఫ్‌ పుట్టిన తేదీ ప్రూఫ్‌
1 జననమరణాల నమోదు చట్టం 1969 ప్రకారం అర్హత ఉన్న అధికారి ఇచ్చిన బర్త్‌ సర్టిఫికెట్‌
2 ఇండియన్ పాస్‌పోర్టు(ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే)
3 న్యాయపరంగా సంరక్షకుడనే చెప్పే పత్రాలు  ×

డాక్యుమెంట్ ఆధారిత నమోదు

Sl NO  లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్   గుర్తింపు పత్రంగా...(POI) చిరునామా ప్రూఫ్‌గా...(POA) పుట్టిన తేదీ ప్రూఫ్‌గా((PDB)
3 గుర్తింపు పొందిన షెల్టర్ హోమ్స్‌, అనాథ శరణాలయాల సూపరింటెండెంట్/ వార్డెన్/ మాట్రన్/ సంస్థాగత అధిపతి UIDAI స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో జారీ చేసిన సర్టిఫికేట్ (సంబంధిత ఆశ్రయ గృహం లేదా అనాథ శరణాలయంలోని పిల్లలకు మాత్రమే) ×

5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల ఆధార్ నమోదు కోసం పత్రాల జాబితా

Sl NO  లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్   గుర్తింపు పత్రంగా...(POI) చిరునామా ప్రూఫ్‌గా...(POA)
1 చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
2 పాన్ కార్డు/ఈ పాన్ కార్డు X
3 రేషన్ కార్డు/పీడీఎస్‌ ఫొటోగ్రాఫ్ కార్డు/ఈ రేషన్ కార్డు 
4 ఓటర్ ఐడెంటీ కార్డు/ఈ ఓటర్ ఐడెంటీ కార్డు 
5 డ్రైవింగ్ లైసెన్స్‌  X
6 ప్రభుత్వం, పీఎస్‌యూ సహా అధీకృత సంస్థ జారీ చేసిన సర్వీస్ ఫొటో ఐడెంటింటీ X
7 పెన్షనర్‌/ ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఐడీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌  X
8 సీజీహెచ్‌/ఈసీహెచ్‌ఎస్‌/ ఈఎస్‌ఐసీ/ మెడిక్లైమ్‌ కార్డు X
9 దివ్యాంగ ఐడీ కార్డు/2017లో ఆర్‌పీడబ్ల్యూడీ రూల్ ప్రకారం జారీ చేసిన సర్టిఫికెట్స్‌
10 ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు
11 ప్రభుత్వం జారీచేసిన ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ సర్టిఫికెట్స్‌
12 గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి మార్క్ షీట్/సర్టిఫికేట్ X
13 ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్ + బ్రాంచ్ మేనేజర్ నుంచి తీసుకున్న KYC సర్టిఫికేట్
14 ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కార్డు / ట్రాన్స్‌జెండర్ చట్టం, 2019 కింద సర్టిఫికేట్  
15(i) MP/MLA/MLC/మునిసిపల్ కౌన్సిలర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ X
15(ii) గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ A / EPFO ​​ఆఫీసర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ X
15(iii) తహసీల్దార్ / గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ B ద్వారా UIDAI సర్టిఫికేట్ X
15(iv) NACO/స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫీసర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ (SC తీర్పు ప్రకారం)
15(v) షెల్టర్ హోమ్/అనాథ శరణాలయం అధిపతి ద్వారా UIDAI సర్టిఫికేట్ (పిల్లలకు మాత్రమే)
15(vi) గుర్తింపు పొందిన విద్యా సంస్థ ద్వారా UIDAI సర్టిఫికేట్ (విద్యార్థులకు మాత్రమే) X
15(vii) గ్రామ పంచాయతీ అధిపతి/కార్యదర్శి లేదా తత్సమాన వ్యక్తి ద్వారా UIDAI సర్టిఫికేట్ (గ్రామీణ ప్రాంతాలకు) X√
16 విద్యుత్ బిల్లు (3 నెలల కంటే ముందుది  కాదు) X
17 నీటి బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X
18 టెలిఫోన్ ల్యాండ్‌లైన్/పోస్ట్-పెయిడ్ మొబైల్/బ్రాడ్‌బ్యాండ్ బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X X
19 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్/బహుమతి పత్రం లేదా అద్దె/లీజు/లీవ్ & లైసెన్స్ ఒప్పందం X
20 గ్యాస్ కనెక్షన్ బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X
21 వసతి కోసం ప్రభుత్వ కేటాయింపు లేఖ (1 సంవత్సరం కంటే పాతది కాదు) X
22 జీవిత లేదా వైద్య బీమా పాలసీ (జారీ చేసినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు చెల్లుతుంది) X
23 జనన, మరణాల నమోదు చట్టం, 1969 కింద జనన ధృవీకరణ పత్రం X X
24 ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ హక్కు పత్రం X X
25 జైలు అధికారి జారీ చేసిన ఖైదీ ఇండక్షన్ పత్రం (PID)
26 చట్టపరమైన సంరక్షకత్వాన్ని నిరూపించే పత్రం  X X

ఆధార్ కార్డులో ఎవరైనా వయసుకు సంబంధించిన అప్‌డేట్‌ చేయాలనుకుంటే?

Sl NO  లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్   గుర్తింపు పత్రంగా...(POI) చిరునామా ప్రూఫ్‌గా...(POA)
1 చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
2 పాన్ కార్డు/ఈ పాన్ కార్డు X
3 రేషన్ కార్డు/పీడీఎస్‌ ఫొటోగ్రాఫ్ కార్డు/ఈ రేషన్ కార్డు 
4 ఓటర్ ఐడెంటీ కార్డు/ఈ ఓటర్ ఐడెంటీ కార్డు 
5 డ్రైవింగ్ లైసెన్స్‌  X
6 ప్రభుత్వం, పీఎస్‌యూ సహా అధీకృత సంస్థ జారీ చేసిన సర్వీస్ ఫొటో ఐడెంటింటీ X
7 పెన్షనర్‌/ ఫ్రీడమ్‌ ఫైటర్‌ ఐడీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌  X
8 సీజీహెచ్‌/ఈసీహెచ్‌ఎస్‌/ ఈఎస్‌ఐసీ/ మెడిక్లైమ్‌ కార్డు X
9 కిసాన్ ఫొటో పాస్ బుక్
10 దివ్యాంగ ఐడీ కార్డు/2017లో ఆర్‌పీడబ్ల్యూడీ రూల్ ప్రకారం జారీ చేసిన సర్టిఫికెట్స్‌
11 ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు
12 వివాహ ధృవీకరణ పత్రం (ఫోటోతో లేదా లేకుండా; ఫోటో లేకపోతే PoI కి మద్దతు అవసరం)
13 ప్రభుత్వం జారీచేసిన ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ సర్టిఫికెట్స్‌
14 స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC) / స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) X
15 గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి మార్క్ షీట్/సర్టిఫికేట్ X
16 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ పాస్‌బుక్ / పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పాస్‌బుక్ (ఫోటో, స్టాంప్ మరియు సంతకంతో) X
17 బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ / క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ / పోస్ట్ ఆఫీస్ ఖాతా స్టేట్‌మెంట్ (3 నెలల కంటే పాతది కాదు, స్టాంపు, సంతకంతో ఉంది) X
18 ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కార్డు / ట్రాన్స్‌జెండర్ చట్టం, 2019 కింద సర్టిఫికేట్
19 MP/MLA/MLC/మునిసిపల్ కౌన్సిలర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ X
20(i) గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ A / EPFO ​​ఆఫీసర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ X
20(ii) తహసీల్దార్ / గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ B ద్వారా UIDAI సర్టిఫికేట్ X
20(iii) NACO/స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫీసర్ ద్వారా UIDAI సర్టిఫికేట్ (SC తీర్పు ప్రకారం)
20(iv) షెల్టర్ హోమ్/అనాథ శరణాలయం అధిపతి ద్వారా UIDAI సర్టిఫికేట్ (పిల్లలకు మాత్రమే)
20(v) గుర్తింపు పొందిన విద్యా సంస్థ ద్వారా UIDAI సర్టిఫికేట్ (విద్యార్థులకు మాత్రమే) X
20(vii) గ్రామ పంచాయతీ అధిపతి/కార్యదర్శి లేదా తత్సమాన వ్యక్తి ద్వారా UIDAI సర్టిఫికేట్ (గ్రామీణ ప్రాంతాలకు) X
21 విద్యుత్ బిల్లు (3 నెలల కంటే ముందుది  కాదు) X
22 నీటి బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X
23 టెలిఫోన్ ల్యాండ్‌లైన్/పోస్ట్-పెయిడ్ మొబైల్/బ్రాడ్‌బ్యాండ్ బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X X
24 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్/బహుమతి పత్రం లేదా అద్దె/లీజు/లీవ్ & లైసెన్స్ ఒప్పందం X
25 గ్యాస్ కనెక్షన్ బిల్లు (3 నెలల కంటే పాతది కాదు) X
26 వసతి కోసం ప్రభుత్వ కేటాయింపు లేఖ (1 సంవత్సరం కంటే పాతది కాదు) X
27 జీవిత లేదా వైద్య బీమా పాలసీ (జారీ చేసినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు చెల్లుతుంది) X
28 జనన, మరణాల నమోదు చట్టం, 1969 కింద జనన ధృవీకరణ పత్రం X X
29 ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ హక్కు పత్రం X X
30 జైలు అధికారి జారీ చేసిన ఖైదీ ఇండక్షన్ పత్రం (PID)
31 కుటుంబ పెద్ద (HoF) నుంచి స్వీయ-ప్రకటన, సంబంధాన్ని ధృవీకరిస్తుంది (చిరునామా నవీకరణ కోసం మాత్రమే) X X
32 చట్టపరమైన సంరక్షకత్వాన్ని నిరూపించే పత్రం  X X