Uttarakhand Gang Rape : కారులో లిఫ్ట్ ఇస్తామని ఆశ చూపి తల్లితో పాటు ఆరేళ్ల కుమార్తెపైనా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం రేపుతోంది. కదులుతున్న కారులోనే వారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎక్కడైనా ఆపితే పోలీసులు చూస్తారని.. కదులుతున్న కారులో పెద్దగా సౌండ్ పెట్టి ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో నిర్బయ తరహాలో జరిగిన రేప్ ఘటన కావడంతో సంచలనంగా మారింది.
కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా? కాల్ చేస్తే ఖాతా ఖాళీ!
కదిలే కారులో తల్లీ, కుమార్తెపై లైంగిక దాడి
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్రాంతానికి చెందిన మహిళ తన ఆరేళ్ల కూతురితో ప్రార్థనా మందిరానికి వెళ్లి వస్తోంది. తన ఇల్లు కాస్త దూరం కావడంతో నడుచుకూంటూ వెళ్తోంది. అదే సమంయలో ఆ దారి గుండా వెళ్తున్న కారులోని వ్యక్తి వారికి లిఫ్ట్ ఇస్తామని ఆశ చూపారు. సాయం చేస్తామన్నట్లుగా పిలవడంతో వారిని నమ్మిన మహిళ కారు ఎక్కింది. అయితే ఆ కారులో డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కాకుండా అతని స్నేహితులు కూడా ఉన్నారు. మహిళ .. తన కుమార్తె సహా కారులో ఎక్కిన తర్వాత వారి పైశాచికత్వం చూపించారు. ఆ చిన్న పిల్లను కూడా వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డారు.
48 గంటల అల్టిమేటం పెట్టిన బీఎస్పీ నేత ఆచూకీ లభ్యం, ఎక్కడున్నారంటే?
అర్థరాత్రి ఓ కాలువ పక్కన వదిలేసిన దుండగులు
అర్థరాత్రి తర్వాత వారిని ఓ కాలువ దగ్గర వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. సోను అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఆ మహిళ షాక్‌లో ఉండటంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరును మాత్రం సోను గా చెబుతోంది. పోలీసులు బాధితురాలిని వెంటనే.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్పించారు.
నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు
నిందితుల కోసం పోలీసుల సెర్చింగ్
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని చూస్తున్నారు. ఇంతవరకూ నిందితుల్ని గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కే్సు ఉత్తరాఖండ్‌లో కలకలం రేపుతోంది. తల్లితోపాటు ఆరేళ్ల చిన్నారినీ రేప్ చేయడం.. అదీ కూడా కదిలే కారులో ఘాతుకానికి పాల్పడటంతో ఉత్తరాఖండ్ నిర్భయ కేసుగా పరిగణిస్తున్నారు.