పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తమ పట్టణంలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. మద్యం మత్తులో భర్త నిత్యం వేధిసస్తున్నాడని ఆగ్రహంతో ఆమె ఈ పని చేసింది. 


పురుషోత్తమ పట్టణంలో అలజడి.... 


చిలకలూరిపేటలోని పురుషోత్తం పట్టణంలో ఉంటున్న సత్తార్, షర్మిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. సత్తార్ వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో తాగుడికి అలవాటు పడిన సత్తార్ ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు భార్యను తరచూ వేధిస్తుంపులకు గురి చేస్తున్నాడు. 


అప్పటి నుంచి ఇద్దరి మధ్య తగాదాలు కూడా జరుగుతుండేవి. 15 రోజుల నుంచి ప్రతి రోజు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో అది తారా స్థాయికి చేరింది. శనివారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో భరించలేని భార్య పక్కనే ఉన్న మంచం కోడును తీసుకొని భర్త తలపై మోదింది. 


భార్య కొట్టిన దెబ్బకు సత్తార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుగా వచ్చిన కుమారుడుని కూడా కొట్టడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన నరసరావుపేట డిఎస్పి విజయభాస్కర్, చిలకలూరిపేట అర్బన్ సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన షర్మిల కుమారుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం...


సాధారణ కుటుంబం కావటంతో ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో భర్త సత్తార్ మద్యానికి అలవాటు పడి ,కుటంబాన్ని పట్టించుకోకుండా,పిల్లలను సైతం లెక్క చేయటం మానేశాడు. చాలా సార్లు భార్య షర్మిల కుటుంబ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ పెద్దలు కూడా చాలా సార్లు సత్తార్‌కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో భార్య షర్మిల కూడా కూలి పనులకు వెళ్ళేందుకు ప్రయత్నించటంతో ఇద్దరిమద్య వివాదం చెలరేగిందని చెబుతున్నారు. మద్యం సేవించి వచ్చిన భర్త సత్తార్ నిత్యం భార్య షర్మిలను వేధించడం స్టార్ట్ చేశాడు. కుటుంబ పెద్దలు భార్య భర్తల మధ్య గొడవలు సర్ది చెప్పేందుకు చాలా సార్లు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.


ఊహించని ఘటన....
నిత్యం కుటుంబపరంగా గొడవలు పడినప్పటికి పిల్లలు కోసం భార్య షర్మిల భర్త పెట్టే వేధింపులను భరిస్తూ వచ్చింది. అనేక సార్లు భర్తకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా, తెల్లవారే సరికి భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి, భార్య పిల్లలను కొట్టేవాడు. దీంతో సహనం కోల్పోయిన భార్య షర్మిల తీవ్ర కోపంలో మంచం కర్ర తీసుకొని భర్త సత్తార్ పై దాడి చేసింది. అయితే కర్ర బలంగా ఉండట,తలపైన బలమైన గాయం కావటంతో సత్తార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఊహించని ఘటన ఆ కుటుంబలో తీవ్ర విషాదాన్ని నింపింది. జరిగిన ఘటన తెలసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల  నుంచి మాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.