Chikoti Praveen Casino :    క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. చికోటిని థాయిలాండ్  పోలీసులు అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లోని పటాయలో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ ఒకరు. ఆయనే ఆర్గనైజర్.  ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో రూ. వంద కోట్ల మేర గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు అనుమిస్తున్నారు. అయితే ఈ అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్..  థాయ్ ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ లీగర్ కదా అనే. లీగల్ కాబట్టే అక్కడకు మనుషుల్ని తీసుకెళ్లి ఆడిస్తున్నారని అనుకున్నారు. కానీ విషయం ఏమిటంటే..థాయ్‌ల్యాండ్‌ గ్యాంబ్లింగ్ ఇల్లీగల్. అందుకే అరెస్ట్ చేశారు. 


థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి మరీ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ ఎందుకు నడిపిసిస్తున్నారు ? లీగల్ అయిన దేశాలకే వెళ్లవచ్చు కదా !


విదేశాల్లో నేరం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో వ్యవస్థల్ని మేనేజ్ చెయడం కష్టమే. ఎందుకంటే అక్కడ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీయులు నేరాల్లో దొరికినప్పుడు ఇంకా కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి నేతలు తమ అంతర్గత భధ్రత వ్యవస్థకు ముప్పు తెస్తాయని అనుకుంటారు. భారత్‌లో గ్యాంబ్లింగ్ ఇల్లీగల్. అయితే గోవాలో పర్మిషన్ ఉంటుంది. వెళ్తే అక్కడికే వెళ్లవచ్చు. లేదా లీగల్ అయిన మరో దేశానికి వెళ్లవచ్చు. కానీ ఇల్లీగర్ అయిన థాయ్ ల్యాండ్‌కే చీకోటి ప్రవీణ్ అంత మందిన ఎందుకు తీసుకెళ్లాడు ? అలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నాడన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 


గ్యాంబ్లింగ్‌కు మించిన బిజినెస్ చీకోటి చేస్తున్నాడా ?


కనీసం రూ.వంద కోట్ల మేర గ్యాంబ్లింగ్ లావాదేవీలు జరగుతున్నాయని పట్టాయ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది చిన్న మొత్తం కాదు. గతంలో చీకోటి ప్రవీణ్ ఇలాంటివి నిర్వహించాడు. కోట్లకు పడగలెత్తాడు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరిపింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. బహుశా ఎలాంటి ఆధారాలు దొరకలేదమో కానీ.. మొత్తంగా వ్యాపారం అయితే మూడు పువ్వులు - ఆరు కాయలుగా నిర్వహిస్తూనే ఉన్నారు. వందల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తూనే ఉన్నారు. అదంతా హవాలా మనీనే. విదేశాల్లో నిర్వహించిన గ్యాంబ్లింగ్ వల్ల.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి ఇండియాకు పంపించే నెట్ వర్క్ ఏమైనా చీకోటి ఏర్పాటు చేసుకున్నాడేమో అన్న సందేహాలు ఈడీకి కూడా గతంలోనే వచ్చాయి. ఇలా హవాలా మనీని రూటింగ్ చేసే బిజినెస్ కూడా ఉందని గతంలోనే ప్రచారం జరిగింది.  లీగల్ గా పర్మిషన్ ఉన్న దేశాలకు క్లయింట్స్ ను తీసుకెళ్లకుండా.. పట్టాయకే వారిని తీసుకెళ్లి రిస్క్‌లో పడేయడం కూడా దీనిపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. 


థాయ్‌ల్యాండ్ పోలీసులు మొత్తం బయట పెట్టేస్తారా ?


థాయ్ ల్యాండ్ పోలీసులపై సహజంగా ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు. కానీ మన రాజకీయ నేతలకు.. దేశ విదేశాల్లో ఉండే సంబంధాలను అంచనా వేయడం కష్టం. చీకోటి ప్రవీణ్‌ను కాపాడాలనుకుంటే.. ఎవరైనా రంగంలోకి దిగితే.. ఏం జరుగుతుందో చెప్పలేం కానీ.. ఎలాంటి నెట్ వర్క్ ప్రయత్నాలు చేయకపోతే మాత్రం థాయ్ ల్యాండ్ పోలీసులు గుట్టు మొత్తం బయట పెట్టే అవకాశం ఉంది. అసలు వారి స్కెచ్ ఏంటి.. ఎన్ని వందల కోట్ల గ్యాంబ్లింగ్ జరుగుతోంది.. వాటిని ఎలా హవాలా చేస్తారు.. ఇలా మొత్తం బయట పెడతారు. అలాగే.. వారి అదుపులో ఉన్న వారి గుట్టు అంతా రట్టు చేస్తారు. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ పెను సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.