అతనో ఉన్నతాధికారి మహిళల పట్ల గౌరవంతో బాధ్యతగా మెలగాల్సిన స్థానంలో ఉండాల్సింది మరిచి ఓ యువతి పేదరికాన్ని అవకాశంగా మార్చుకుని పలుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ  ప్రబుద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటనలో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రబుద్ధుడిని ముందు వీఆర్ కు పంపారు. దర్యాప్తు చేసిన అధికారులు తాజాగా అతడిని సస్పెండ్ చేశారు. 


Also Read:మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..


యువతిపై పలుమార్లు అత్యాచారం


గతంలో ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వై. బాల రాజాజీ ఏలూరు పట్టణానికి చెందిన ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చాయి. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన సీఐ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు  విచారణలో వెల్లడైంది.  ప్రస్తుతం ఏలూరు ట్రాఫిక్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ బాల రాజాజీపై ఆరోపణలు నేపథ్యంలో వీ ఆర్ కి పంపారు ఉన్నతాధికారులు. కేసును సుమోటోగా తీసుకుని ఘటనపై విచారణ చేయాలని డీఎస్పీ దిలీప్ కిరణ్ ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు సీఐ బాల రాజాజీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ  సంఘటనకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా డీఐజీ  తెలియజేశారు. 


Also Read: గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి.. రెక్కీ ఎవరు నిర్వహించారన్నదానిపై పోలీసుల అంతర్గత విచారణ !


హెడ్ కానిస్టేబుల్ వక్రబుద్ధి


నెల్లూరు జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ తన పాడుబుద్ధి బయటపెట్టాడు. చిట్టమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమకు న్యాయం చేయాలని ఓ ఘటనలో పోలీసులను ఆశ్రయించారు. ఈ  ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణ కోసం హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ బాధిత కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో 15 ఏళ్ల బాలిక ఒక్కటే ఉంది. ఒంటరిగా ఉన్న బాలికను చూసిన కానిస్టేబుల్ ఆమెకు ధైర్యం చెప్పి వివరాలు తెలుసుకోవాల్సింది పోయి తనలోని మృగాడ్ని బయటపెట్టాడు. బాలికపై కన్నేసి మాయమాటలు చెబుతూ ఒంటిమీద చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో కానిస్టేబుల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.


Also Read: బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి బలవన్మరణం.... కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి మెసేజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి