బ్యాడ్మింటన్ ఉన్నత శిఖరానికి ఎదగాలని ఎన్నో కలలుకనింది ఆ యువతి. బ్యాడ్మింటర్ ఆటలో జూనియర్, నేషనల్ స్థాయిలో పాల్గొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి చూసి ప్రాక్టీస్ కు డబ్బులు అడగలేక తన కలల్ని తానే అర్థాంతరంగా చంపుకుంది.
యానాం పట్టణ పరిధిలోని బాలయోగి నగర్ లో నివాసం ఉంటున్న బ్యాడ్మింటన్ యువ క్రీడాకారిణి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన దండుప్రోలు ధర్మారావు చిన్న కుమార్తె ఆదిలక్ష్మి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చేపల వ్యాపారం చేసే తండ్రి కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్నారని దీంతో భవిష్యత్తుపై బెంగతో బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. బలవన్మరణానికి ముందు అర్ధరాత్రి తన సోదరికి 'అక్కా.. నాకు వెళ్లాలని లేదు. కానీ మన ఫ్యూచర్ కోసం నాన్నమ్మ భయంతో ఉందని అర్థమైంది. ఓపక్క నాన్న ఇంట్లో ఏం పట్టించుకోరు. నాన్నమ్మకి, అమ్మకి ఆరోగ్యం బాలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉందక్కా.. నావల్ల కావట్లేదు. ఐయాం సారీ, కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. బై అక్కా...' అంటూ వాట్సాప్ లో మేసేజ్ పంపి ఆత్మహత్య చేసుకుంది.
Also Read: గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి.. రెక్కీ ఎవరు నిర్వహించారన్నదానిపై పోలీసుల అంతర్గత విచారణ !
సోమవారం తెల్లవారుజామున బ్యాడ్మింటన్ ఆడేందుకు బయల్దేరే ఆదిలక్ష్మి దేవుడి గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె అక్క ధనకుమారి వెళ్లి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. తండ్రి ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నందకుమార్ తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కకు పంపిన మేసేజ్ చూసి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read:మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
తూర్పు గోదావరి జిల్లా యానాంలోని స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన ఆదిలక్ష్మి బాల్ బ్యాడ్మింటన్ లో మంచి ప్రతిభ చూపింది. ఆటలో రాణిస్తూ 2019, 2020లలో ఎస్‌జీఎఫ్‌ఐ, సబ్ జూనియర్ నేషనల్స్ పోటీల్లో ఆమె పాల్గొంది. చేపల వ్యాపారం చేసే తండ్రి ఖాళీగా ఉంటుండటంతో భవిష్యత్తుపై బెంగతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి