Maoist Arrest : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మావోయిస్టులతో పాటు ముగ్గురు సానుభూతిపరులను టాస్క్ ఫోర్స్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుంచి పోలీసులు 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటనేటర్లు, రూ.74 వేల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బోలెరో కారు, సెల్ ఫోన్లు, ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దండకారుణ్య సౌత్ సబ్ జోన్ డాక్టర్స్ టీం కమాండర్ మడకం ఉంగి అలియాస్ కమల, మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు అసం సోహెన్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు క్రాంతికారి ఆదివాసి మహిళ సంఘ్ అధ్యక్షురాలు మీచ అనిత, ఆర్.పి.పి అధ్యక్షుడు గొడ్డి గోపాల్, కందగుర్ల సత్యం  మవోయిస్టు సానుభూతి పరులను కూడా అరెస్టు చేశారు. 



వాహన తనిఖీల్లో 


ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. విశ్వసనీయ సమచారంతో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఆదివారం సాయంత్రం ములుగు రోడ్డు ప్రాంతంలో ఆజర హాస్పటల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న బోలేరో వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా కారులో పేలుడు పదార్థాలతో పాటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన సాహిత్యాన్ని గుర్తించామన్నారు. పోలీసులు తక్షణమే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, డ్రైవర్ తో సహా మరో ముగ్గురు వ్యక్తులను విచారించగా పట్టుబడిన వ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతిపరులుగా గుర్తించారన్నారు.  


హనుమకొండలో వైద్యం 


పట్టుబడిన మావోయిస్టుల్లో ఒకరైన మహిళా మాయిస్టు మడకం ఉంగి అలియాస్ కమల కొద్ది రోజులుగా అనారోగ్యం బాధపడుతుండంతో మెరుగైన చికిత్స కోసం మావోయిస్టు పార్టీ నాయకత్వం సూచనలతో మరో మావోయిస్టు, ముగ్గురు సానుభూతిపరులతో కలిసి ములుగు జిల్లా మీదుగా హనుమకొండకు చేరుకున్నారు. వీరు ఉంగికి హనుమకొండలోని ప్రముఖ హాస్పటల్ లో చికిత్స అందించే సమయంలో మావోయిస్టు పార్టీ నాయకత్వం సూచనలతో మావోయిస్టుల్లో ఒకరైన అసం సోహెన్  హనుమకొండ
ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రెండు బాక్సుల పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. మహిళా మావోయిస్టు ఉంగికి చికిత్స పూర్తయిన తర్వాత మావోయిస్టు సభ్యులు ఛత్తీస్ ఘడ్ కు తిరిగి వెళ్లే సమయంలో ఈ ఇద్దరు మావోయిస్టులతో పాటు ముగ్గురు సానుభూతిపరులు నిన్న సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డారు. 


15 ఏళ్ల వయసులో 


మడకం ఉంగి అలియాస్ కమల వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది. కమల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువుకోలేదు.  ఉంగి పదిహేను సంవత్సరాల వయస్సులో తన గ్రామానికి వచ్చిన సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యుల విప్లవ సాహిత్య ప్రసంగాలు, పాటలకు ఆకర్షితులరాలైంది. ఉంగి ఆలియాస్ కమల మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ బాలల సంఘంలో చేరి మావోయిస్టులకు సానుభూతిపరులిగా పనిచేస్తూనే తమ గ్రామానికి వచ్చే మావోయిస్టు సభ్యులకు నిత్యవసర సరుకులతో పార్టీ అవసరమైన వస్తువులను అందజేస్తూ 2007 వరకు బాలల సంఘంలో పనిచేసింది. 2011 సంవత్సరంలో ముసాకి చంద్రు నాయకత్వంలో మిలిషియా సభ్యులరాలిగా పనిచేసి, అదే సంవత్సరం పామెడు ఎల్.జీ.ఎస్ కమాండర్ బొద్దే కిషన్ ఆధ్వర్యంలో ఎన్డీయస్ సభ్యురాలిగా పనిచేసింది.  పార్టీ అదేశాలతో ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉన్న ఉంగి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగే ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేది.