AP Government: రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. మూడు చక్రాల వాహనాలను ఉచితంగా అందిచేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ(ఏపీడీఏఎస్సీఏసీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 70 శాతానికి పైగా వైకల్యం కల్గిన 18 నుంచి 45 ఎళ్ల లోపు వయసు కల్గిన వారంతా ఇందుకు అర్హులు అని తెలిపింది. లబ్ధిదారులంతా ఆన్ లైన్ ద్వారా ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


ఎవరెవరు అర్హులు..?



  • 70 శాతానికి పైగా వైకల్యం కల్గి ఉండాలి. ఇందుకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి.

  • అలాగే వీరి వయసు 18 నుంచి 45 ఏళ్లు లోపు మాత్రమే ఉండాలి.

  • కనీసం పదో తరగతి పాసై ఉండాలి.

  • వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల్లోపు ఉండాలి.

  • ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కల్గి ఉండాలి. 

  • ఎలాంటి సొంత వాహనాలు ఉండకూడదు.

  • గతంలో ప్రభుత్వం నుంచి ఇలాంటి వాహనాలు పొంది ఉండకూడదు. 


పైన పేర్కొన్న వాటన్నిటిని కల్గి ఉన్న లబ్ధిదారులు జిల్లా మెడకిల్ బోర్డు వారు ఇచ్చిన సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, అలాగే పాస్ పోర్టు సైజు దివ్యాంగుల పూర్తి ఫొటోను తీసుకెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నిటిని ఏపీడీఏఎస్సీఏసీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.