Visakha Crime News: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో హత్య ఘటన కలకలం రేపింది. బాలుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది. మృతి చెందిన మైనర్ భజన కోవెలవీధికి చెందిన బాలుడిగా గుర్తించారు. స్థానిక భజన కోవెలవీధికి చెందిన మైలపల్లి చిన్నా అలియాస్ విస్కీ అనే 17 ఏళ్ల బాలుడి గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చంపేసిన అనంతరం మైనర్ బాలుడి మృతదేహాన్ని సముద్రంలోకి విసిరి వేసినట్లు తెలిపారు. వాడ బలిజ సామాజిక వర్గానికి చెందిన మైలపల్లి చిన్నా అలియాస్ విస్కీ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు విస్కీకి ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని తల్లిదండ్రులు, బంధు మిత్రులు చెబుతున్నారు. బాలుడు విస్కీ గొంతు కోసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 11 సమీపంలో సముద్రంలోకి విసిరేశారని పోలీసులు గుర్తించారు.


Read Also: Hyderabad: మాజీ హోంగార్డు హత్య కేసును ఛేదించిన పోలీసులు, 8 మంది అరెస్టు


ఇటీవల కన్నకొడుకునే చంపేసిన తల్లి


వ్యసనాలకు అలవాటు పడిన కొడుకు వేధింపులు తట్టుకొలేక, తల్లే కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో పోలీసులు కూడ షాక్‌కి గురయ్యారు. విజయవాడ పాతబస్తి కొత్తపేటలో అప్పరావమ్మ వీధిలో మద్దూరి మాధవి అనే వివాహిత నివాసం ఉంటుంది. మాధవికి ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవటంతో ఒక హోటల్‌లో రోజు వారి కూలికి పని చేస్తుంది. మాధవి కుమారుడు దేవ కుమార్‌కు 19 సంవత్సరాల వయస్సు. చిన్న వయస్సులోనే దేవ కుమార్ దారి తప్పడు. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. వ్యసనాల బారిన పడ్డ దేవ కుమార్‌ ఇంట్లో తల్లి, చెల్లిపై దాడులకు పాల్పడుతున్నాడు. మద్యానికి డబ్బులు కావాలంటూ రోజూ ఇంట్లో గొడవ పడుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లి కొడుకు పెట్టే బాధలను భరించలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డ అని కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంది. 


సహకరించి ఆ ఇద్దరు...


కొడుకు పెట్టే బాధలతో తల్లి మాధవి, 17సంవత్సరాల కుమార్తె, భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో తాను పని చేసే హోటల్‌లో ఓ వ్యక్తితో మాధవికి పరిచయమైంది. కొడుకు పెట్టే బాధలను గురించి అలీ ఖాన్‌తో చెప్పిన మాధవి అతన్ని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్టు కూడా వివరించింది. గత నెల 27న తాగి వచ్చిన కొడుకు దేవకుమార్ ఇంటిలో గొడవ పడ్డాడు. అదే సమయంలో అలీ ఖాన్ కూడా ఇంటికి వచ్చాడు. తాగిన మైకంలో ఉన్న దేవకుమార్‌పై తల్లి మాదవి, ఆమె ఫ్రెండ్‌ అలీఖాన్‌తోపాటుగా చెల్లెలు కూడా దాడి చేశారు. దేవ కుమార్‌కు ఊపిరి ఆడకుండా చేసి నోరు నొక్కి చంపేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మద్యం సేవించి చనిపొయాడంటూ మాధవి స్థానికులను నమ్మించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దేవ కుమార్ డెడ్ బాడిని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ తరువాత అంత్యక్రయలు కూడా జరిగాయి. కానీ నోరును నొక్కి పెట్టి, గొంతు మీద బలంగా దాడి చేసి ఊపిరి ఆడకుండా చేయటం వలన దేవ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇలా అసలు నిందితులు వెలుగులోకి వచ్చారు.