Vijayawada News : యువతితో మసాజ్ చేయించి ట్రాప్, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని యువకుడు సెల్ఫీ సూసైడ్!

ABP Desam Updated at: 31 May 2022 06:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Vijayawada News : విజయవాడలో ఓ సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపుతోంది. ఓ యువతితో తనను ట్రాప్ చేయించి డబ్బులు కోసం బెదిస్తున్నారని యువకుడు వాపోయాడు. తన చావుకు ముగ్గురు కారణమని చెబుతున్నాడు.

విజయవాడలో సెల్ఫీ సూసైడ్ పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి

NEXT PREV

Vijayawada News : పల్నాడు జిల్లా వినుకొండకు శ్రీకాంత్ అనే వ్యక్తి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్​ లో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని నమ్మి మోసపోయానని శ్రీకాంత్ వీడియోలో పేర్కొన్నాడు. ములుకోటి సతీష్ కుమార్, ములుకోటి చైతన్య, సునీల్‌ అనే ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణమని శ్రీకాంత్‌ వీడియో చెప్పాడు. ఒక యువతితో తనను ట్రాప్ చేయించి, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తన భార్యాబిడ్డల్ని చంపుతామని భయపెడుతున్నారని సెల్ఫీ వీడియోలో శ్రీకాంత్ తెలిపాడు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతుడి ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. 


మసాజ్ తో ట్రాప్ 


యువతితో మసాజ్ ద్వారా ట్రాప్ చేసి డబ్బులు ఇవ్వాలని వేధించడంతో యువకుడు ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. యువకుడి సెల్ఫీ వీడియోలో తన చావుకు ముగ్గురు కారణమని చెప్పాడు. ఒక యువతితో తనను ట్రాప్ చేశారని బాధితుడు వాపోయాడు. కొన్ని ఫోటోలతో తనను బెదిరించినట్లు శ్రీకాంత్ చెబుతున్నాడు. తన భార్యాబిడ్డలను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, వారికి పోలీసులు రక్షణ కల్పించాలని వీడియోలో వేడుకున్నాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని, డబ్బులు డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తెలిపాడు. నిందితులు విజయవాడ సింగ్ నగర్ కు చెందిన వారిగా శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై శ్రీకాంత్ రెడ్డి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 



నా చావుకు కారణం ములుకోటి సతీష్ కుమార్, ములుకోటి చైతన్య భార్యభర్తలు. వాళ్ల బావ వినుకొండ సునీల్. నన్ను మసాజ్ పార్లర్ కు రప్పించి ట్రాప్ చేశారు. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియడంలేదు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నాను - -శ్రీకాంత్ రెడ్డి, బాధితుడు


పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నం


 హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో టీవీ నటి మైథిలి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాల కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని మనస్థాపానికి లోనై ఆమె పోలీసులకు కాల్ చేసి సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది.  పంజాగుట్ట పీఎస్ ఎస్‌ఐ... ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల సహాయంతో ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని కాపాడారు. అనంతరం ఆమెను నిమ్స్ దవాఖానాకు తరలించారు పంజాగుట్ట పోలీసులు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 


 

Published at: 31 May 2022 06:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.