అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ వచ్చింది. ఓ ఇంటి లాన్‌లోకి వెళ్లింది. అక్కడ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పోలీస్ ప్రయత్నించాడు. కానీ ఆ వ్యక్తి ప్రతిఘటించాడు. అంతే... ఆ వ్యక్తిని కింద పడేసి.. పెనుగులాడుతూంటే స్టెన్ గన్ తీసి కణతపై తుపాకీ పెట్టి... వరుసగా మూడు సార్లు కాల్చేశాడు. దాంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఇదేమీ సినిమా సీన్ కాదు. రియలే. ఈ ఘటన చూసే వారికి ఒక్క సారిగా షాక్ కొట్టింది. ఆ పోలీస్ ఏం చేశాడో కాసేపటి వరకూ ఎవరికీ అర్థం కాలేదు. అర్థమైన తర్వాత భయంతో వణికిపోయారు. 



అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు


మిచిగిన్‌లో పోలీసు కాల్చి చంపిన వ్యక్తిని పాట్రిక్ లోయా అనే ఇరవై ఆరేళ్ల యువకుడిగా గుర్తించారు. అతను ఏం నేరం చేశాడు.. ఎందుకు పోలీసు పట్టుకోబోయాడు.. ఎందుకు చంపేశాడు అన్నదానిపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ ఘటన ఈ నెల నాలుగో తేదీన జరిగింది. వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  పాట్రిక్ లోయాను పోలీస్ ఆఫీసర్  తన వ్యాన్‌లోకి ఎక్కమన్నారు. ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లోయాను పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాట్రిక్‌ను వెంబడించిన పోలీసు ఇంగ్లిష్‌లో మాట్లాడాలని..  లైసెన్స్ చూపించాలని అడిగారని మరికొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 


ఏదీ నక్కిలీసు గొలుసు అంటూ ఇమ్రాన్‌ను నిలదీస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం


పాట్రిక్ అమెరికా జాతీయుడు కాదు. ఆయన రెప్యూజీ అని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన కావడంతో ఆమెరికాలో చర్చనీయాంశం అవుతోంది. చనిపోయిన పాట్రిక్ నల్లజాతీయుడు. చంపేసిన పోలీస్ శ్వేత జాతీయడు. జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపేసిన పోలీస్ ఆఫీసర్‌కు శిక్ష పడింది. అయితే దేశంలో పెద్ద ఎత్తున బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం నడిచింది.  కొన్నాళ్ల పాటు ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపుతోంది.   పోలీసు అధికారులు ఈ ఘటనపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.  . ఆ పోలీసు అధికారిపై కేసు నమోదు చేశారో లేదో స్పష్టత లేదు.