చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి అనే గ్రామంలో ఉన్న గుళ్లో రాత్రి పూట అలికిడి అయిన శబ్దాలు వినిపించడంతో గ్రామస్తులంతా దొంగలు పడినట్లుగా గుర్తించారు. ఓ దొంగను పట్టుకున్నారు. పోలీసుల్ని పిలిపించి అప్పగించారు. పోలీస్ స్టేషన్‌లో ఆ దొంగ కానిస్టేబుల్ తుపాకీ చివరన ఉండే కత్తిని తీసుకుని గొంతు కోసేసుకున్నాడు. దీంతో కంగారు పడిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఎక్కడ లాకప్‌డెత్ కేసు తమ మీదకు వస్తుందోనని వారు హైరానా పడిపోయారు. మినికి గుళ్లో ఎలాంటి దొంగతనం జరగలేదు. ఉన్నవి ఉన్నట్లుగానే ఉన్నాయి. అయినా ఆ కేసు కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో పోలీసులకు అర్థం కాలేదు. ఆ దొంగనే ప్రశ్నించినా సస్పెన్స్ వీడలేదు. కానీ ఆ దొంగలో పోలీసులు ప్రశ్నించిన తర్వాత కాస్తంత ప్రశాంతత ఉండటం గమనించారు. అసలు ఆ మిస్టరీ ఏమిటో అర్థం కాలేదు.
అసలు ఆ దొంగ తాను ఆత్మహత్యాయత్నం చేసింది దొంగతనం కేసులో అరెస్ట్ చేశారని కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ వ్యక్తి మినికి అనే ఊళ్లో గుళ్లో దొంగతనానికి రాలేదు. దాక్కోడానికి వచ్చాడు. అదీ కూడా పోలీసుల నుంచితప్పించుకోవడానికే . కానీ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. ఇక్కడ ట్విస్టేమిటంటే తనను దొంగతనం కేసులో అరెస్ట్ చేశారని అతనికి తెలియదు. తను చేసిన వేరే నేరంలోనే పట్టుకున్నారని.. ఆ కేసు గురించి బయటకు తెలిస్తే పోలీసులు కాదు బంధువులు బతకనీయరన్న ఉద్దేశంతోనే ఆ దొంగ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంతకీ అతను చేసిన నేరం ఏమిటంటే సొంత వదినపై అత్యాచారయత్నానికి పాల్పడటం.
Also Read : డిపాజిట్లు తమ సొంతమేనని స్వాహా ! చిత్తూరు జిల్లాలో బ్యాంక్ సిబ్బంది నిర్వాకం
చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలం, ప్యాడరాసిపల్లెలో అన్న, వదినల దగ్గర ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడు గంగిరెడ్డి. కొంత కాలం తిన్నగానే ఉన్న ఇటీవలి కాలంలో వదినను వక్రబుద్దితో చూడటం ప్రారంభించాడు. అప్పుడప్పుడు చేయి తాకడం వంటి అసభ్యకరమైన పనులకు పాల్పడేవాడు. ఇంట్లో చెబితే గొడవలు అవుతాయని.. గంగిరెడ్డి ని అందరూ తప్పుడు వ్యక్తిగా చూస్తారని ఆమె వీలైనంత వరకూ తప్పు చేస్తున్నావని హెచ్చరించేది. అయినా మాట వినలేదు. అతని ఆగడాలు పెరిగిపోతూండటంతో భర్తకు చెప్పింది. అయితే తమ్ముడి విషయాన్ని అన్న సీరియస్‌గ ాతీసుకోలేదు. అన్న ఉన్నప్పుడు బుద్దిమంతుడిలా నటించే గంగిరెడ్డి వదిన ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వరూపం చూపేవాడు. Also Read : బట్టల దుకాణంలో దొంగతనం కేసు... సస్పెండ్ అయిన ఏఎస్సై గుండె పోటుతో మృతి...
చివరికి మూడు రోజుల కిందట అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి గ్రామానికి వెళ్లారు. కానీ అప్పటికే కేసు పెట్టిన విషయం తెలుసుకున్న గంగిరెడ్డి గ్రామం వదిలి పరారయ్యారు. ఎక్కడ దాక్కున్నా ఎవరో ఒకరు చూసి పోలీసులకు చెబుతారని పక్క గ్రామానికి వెల్లి గుళ్లో దాక్కున్నాడు. గుళ్లో దాక్కున్న గంగిరెడ్డిని చూసిన గ్రామస్తులు దొంగతనం చేయడానికి వచ్చాడని భావించి పోలీసులకు పట్టించారు.. అయితే తన వదిన కేసులో గ్రామస్తులు అంతా తనను పోలీసులకు అప్పగించారని భ్రమ పడిన గంగిరెడ్డి పోలీసు స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read : పాపులారిటీ కోసం నడి రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి రచ్చ చేసింది, ఇప్పుడు చిక్కుల్లో పడింది..
చివరికి వదినపై అత్యాచారం కేసులో తాము వెదుకుతున్న గంగిరెడ్డి ఇతనేనని తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడ గానే ఉండడంతో కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారు. దారి తప్పి వావి వరుసలు మర్చిపోయిన గంగిరెడ్డి చివరికి కటకటాల పాలయ్యాడు.
Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?