Uttar Pradesh Crime News: ఆన్ లైన్ యాప్ లో ఓ మహిళ యువకులతో సెక్స్ చాట్ చేస్తూ లక్షలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఓ యువకుడికి దగ్గరై అర్ధనగ్నంగా ఉండి వీడియో కాల్స్ లో మాట్లాడింది. దీంతో అతడు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆమె వీడియోలను సేవ్ చేశాడు. ఆపై తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫొటోలు, వీడియోలను భర్తకు పంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోకపోవడంతో.. అతడు వాటిని సదరు మహిళ భర్తకు పంపాడు. దీంతో షాకైన భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం చేశాడు. ఆమె ఒప్పుకోకపోయేసరికి హింసించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. 


అసలేం జరిగిందంటే..?


స్థానిక వార్తా పత్రికలు రాసిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో ఫైజాబాద్ కు చెందిన ఓ వివాహిత యువకులతో ఆన్ లైన్ యాప్ ద్వారా సెక్స్ చాట్ చేసేది. అలా ఓ యువకుడితో మాట్లాడుతూ.. అతడికి దగ్గరైంది. ఓ రోజు మహిళ వీడియో కాల్ చేయగా.. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆమె అర్ధ నగ్నంగా అతడితో మాట్లాడింది. ఈ అసభ్య ఫొటోలు, వీడియోలను అతగాడు సేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు మహిళను డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను నీ భర్తకు పంపుతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అందుకు మహిళ అంగీకరించకపోవడం వల్ల ఆమె ఫొటోలను భర్తకు పంపాడు. ఇదే అదునుగా చేసుకున్న భర్త ఆమె వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. 


విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన యువతి


ఏం చేయాలో పాలుపోని సదరు యువతి.. బాగా ఆలోచించింది. భర్త వేధింపులు తట్టుకోలేక కోర్టును ఆశ్రయించింది. లఖ్ నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇలాంటి తరహా కేసును తొలిసారి చూస్తున్నానని సీనియర్ ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్ సిద్ధాంత్ కుమార్ తెలిపారు. సెక్స్ చాట్ ల ద్వారా మహిళ నెలకు 80 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదించేదని చెప్పారు. అయితే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అడిగిన భర్తకు.. సోషల్ మీడియాలో తన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయని, అందుకే తనకు డబ్బులు వస్తున్నాయని చెప్పినట్లు వివరించారు. 


అయితే భార్య సెక్స్ చాట్ చేస్తూ డబ్బులు సంపాదించిన విషయం తెలుసుకున్న భర్త ఆమె బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బును కాజేయాలని ప్రయత్నించాడని, భార్య బ్యాంకు ఖాతాలన్నింటిని బ్లాక్ చేశాడని లాయర్ వెల్లడించారు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అతడు ఇష్టపడడం లేదని, దీంతో సదరు మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహిళకు కోర్టు కౌన్సిలింగ్ ఇప్పించగా... డబ్బుల కోసం ఆశపడి తాను పెద్ద తప్పు చేశానని మహిళ స్వయంగా అంగీకరించిందని ఫ్యామిలీ కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధాంత్ కుమార్ పేర్కొన్నారు.