UP Crime News: నీ భార్యను కొడుతూ నాకు వీడియో కాల్ లో చూపించు డార్లింగ్.. ప్లీజ్ అంటూ ప్రియురాలు అడుగుతుంటే అతడు.. భార్యను కొట్టేందుకు ఏమాత్రం ఆలోచించలేదు. ఆమెను తీవ్రంగా వేధిస్తూ.. ప్రియురాలికి చూపించేవాడు. ఆమె దీన్ని చూస్తూ.. తెగ ఎంజాయే చేసేది. 


తన భర్త వివాహేత సంబంధం పెట్టుకుని.. ఆమె చెప్పినట్లు వింటున్నాడని, వీడియో కాల్ చేసి నన్ను కొడుతూ చూపించమంటే ఆమె మాట విని తీవ్రంగా కొడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషాధ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న హరిపర్వత్ కు చెందిన ఓ మహిళతో రాబిన్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి రాబిన్ తన భార్య దగ్గరకు రావడం తగ్గించేశాడు. పిల్లలు గుర్తు వచ్చి ఏరోజైనా అతడు భార్యా, పిల్లల వద్దకు వెళ్తే... ప్రయురాలు వీడియో కాల్ చేసి భార్యను కొడుతూ చూపించమని కోరేది. 


అయితే ప్రియురాలి కోరిక మేరకు రాబిన్ భార్యను విపరీతంగా కొట్టేవాడు. అతడు కొడుతుంటే... భార్య విపరీతంగా ఏడ్చేది. దీన్ని చూస్తూ ప్రియురాలు చాలా సంతోషించేది. అయితే భర్త వేధింపులు తట్టుకోలేని బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను మభ్య పెట్టి డబ్బులు గుంజుకుంటారని, డబ్బులు ఇవ్వని వారిపై అత్యాచారం కేసులు పెడతారని ఆరోపించింది. అయితే ఆమె కోరిక మేరకు భర్త తనను తీవ్రంగా హింసిస్తున్నాడని చెప్పింది. ఈ సమస్య నుంచి తనను, తన భర్తను కాపాడమని పోలీసులను కోరింది. 


ఆరేళ్ల అమ్మాయిపై యువకుడి అత్యాచారం, గుంజీలు తీయించిన గ్రామపెద్దలు


బిహార్‌లోని నవాడా అనే పట్టణంలో ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ఊళ్లో జరిగిన ఓ భారీ నేరం విషయంలో జనాన్ని సమీకరించి పంచాయితీ పెట్టించారు. అందులో గ్రామ పెద్దలు ఓ తీర్మానం చేశారు. అత్యాచార నిందితుడిని పోలీసులకు అప్పగించడానికి బదులు, పంచాయితీ అతడికి ఓ శిక్ష వేసింది. ఆ శిక్ష ఏంటో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా అత్యాచారం చేసిన ఆరోపణలు వచ్చినా అందుకు గుంజీళ్లు తీయమని పంచాయితీ పెద్దలు శిక్ష వేశారు. కేవలం 5 గుంజీళ్లు తీయమని శిక్ష వేశారు. పంచాయితీకి వచ్చిన ప్రజల ముందు నిందితుడు గుంజీళ్లు తీశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతణ్ని విడిచిపెట్టారు. ఈ ఘటన నవాడా ప్రాంతంలోని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నౌజ్ గ్రామంలో జరిగింది.


అక్బర్ పూర్ సమీపంలోని కన్నౌజ్ గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికను ఓ యువకుడు తన రేప్ చేశాడనేది ఆరోపణ. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో న్యాయం కోసం పంచాయితీ పెట్టించారు. విషయం బయటకు పొక్కడంతో పంచాయితీ పెట్టి నిందితులను పిలిపించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించడం కాకుండా అందరి ముందూ 5 సార్లు గుంజీళ్లు తీయాలని పంచాయితీ పెద్దలు ఆదేశించారు. నిందితుడు గుంజీళ్లు తీసి ఆ ఆరోపణల నుంచి విముక్తి పొంది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పంచాయితీ ఆదేశం, శిక్ష ప్రక్రియను అక్కడే ఉన్న ఎవరో వీడియో తీశారు. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నిందితుడు సిట్‌ అప్‌లు చేస్తూ కనిపించాడు. ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ ఘటన చాలా దారుణం అని అందులో చెప్పాడు.