Crime News :  అది హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఆ పీఎస్ మీదుగా వెళ్తున్న వారికి లోపల పెద్ద సంఖ్యలో బైక్‌లు పార్క్ ఉండటం కనిపిస్తూ ఉంది. అక్కడ పట్టక కొన్ని బయట పార్క్ చేసింది. పోలీస్ స్టేషన్‌కు పార్కింగ్ ప్రాబ్లం అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అక్కడే ఉండేవారికి మాత్రం పోలీస్ స్టేషన్‌ పార్కింగ్ అక్కడ చేయరు కదా ఎందుకలా ఉన్నాయని చిన్న డౌట్ వచ్చింది. కాసేపటికి అది తీరిపోయింది. అదేమిటంటే.. అవి దొంగోడు కొట్టేసిన సొమ్ము. రికవరీ చేయగలిగినంత చేస్తే ఆ మాత్రం ఉన్నాయి.


ఎన్ని ఫింగర్ ప్రింట్లు ఉంటే అన్ని జీతాలు - "గ్రేటర్‌"లో ఇది మైండ్ బ్లాంకయ్యే స్కాం !


కొంత కాలంగా  ట్రో స్టేషన్లు..  బస్టాండ్లలో పార్క్ చేసిన బైకులు మిస్సవుతున్నాయి. ఇలాపార్క్ చేసి అలా వెళ్లి వచ్చే సరికి ఎత్తుకెళ్లిపోతున్నారు. బైకులు పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారు. దీంతో పోలీసులకు ఇదంతా ఒక్కరే చేస్తున్నారని అర్థమైంది. పోలీసులు సీసీ కెమెరాలుకు జల్లెడ పట్టి చివరికి దొంగను గుర్తించారు. చివరికి మాటు వేసి పట్టుకున్నారు. అతనిపేరు వంగాల రాజు. అతన్ని పట్టుకుని పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని బైకులు దొంగతనం చేశాడో లెక్క బయట పెట్టాడు.


11మందితో పెళ్లి! 3 వీధుల్లో ముగ్గురు భార్యలు, ఒకరి దగ్గర డబ్బు గుంజి మరో భార్యతో సంసారం


నేరస్థుడు రాజు ఉప్పల్ పిఎస్ పరిధిలో 13, ఘట్కేసర్ పిఎస్ పరిధిలో1, వరంగల్ చిల్పుర్ పిఎస్ పరిధిలో 1, ఖాజీపేట వరంగల్ పిఎస్ పరిధిలో2, భువనగిరి పిఎస్ పరిధిలో 2, కుషాయిగూడ పిఎస్ పరిధిలో 1, మేడిపల్లి పిఎస్ పరిధిలో 1, ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో 1, ఇలా 22బైక్ లు దొంగిలించాడు. చాలా వరకూ అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పటికీ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నా..వాటిని వెదుక్కుని తెచ్చి రికవరీ చూపెట్టారు. రాజు వద్ద స్వాధీనం చేసుకున్న బైక్‌ల విలువ పదమూడు లక్షల యాభై వేల విలువ ఉంటుందని అంచనా.


అయితే వంగాల రాజు రీసెంట్ చోరీ హిస్టరీ మాత్రమే చెబుతున్నాడని.. పాత కథలు చాలా ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆ చరిత్రేమిటో  బయటకులాగేందుకు  ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా ఈ మధ్య కాలంలో చోరీ చేసిన సొత్తును రికవరీ చేస్తేనే పోలీస్ స్టేషన్ సరిపోలేదని.. ఇంకా పాత దొంగతనాల లెక్క తీస్తే.. గోడౌన్ బుక్ చేయాల్సిదేనని పోలీసులు కూడా సెటైర్లు వేస్తున్నారు.