UP Woman Set On Fire Reaches Hospital On Her Scooter Dies: ఉత్తరప్రదేశ్‌లో స్థలాన్ని ఆక్రమించుకోవాలనుకున్న కొంత మంది చేసిన దురాగతంలో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఆ మహిళా కాలిపోతున్నా.. స్కూటర్‌పై ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. 

అలీగఢ్ జిల్లా, లోహాగఢ్ గ్రామంలో  బాధిత మహిళ  గ్రామంలోని ఒక చిన్న కుటుంబానికి చెందినవారు. ఆమె ఇంటి సమీపంలో ఉన్న పొలంలో పని చేస్తూ ఉండగా కొంత మంది కబ్జా దారులు ఆమెపై దాడి చేశారు.   ఆమెను చంపేందుకు ప్రయత్నించారు.  ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. 

మహిళ తన ప్రాణాలను కాపాడుకునేదుకు మంటలతోనే  తన స్కూటర్‌పై ఆసుపత్రికి బయలుదేరింది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆమె, గ్రామీణ ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆమె శరీరం ఎనభై శాతం కాలిపోయింది. వైద్యులు ఆమెను బతికించేందుకు ప్రయత్నించారుకానీ.. సాధ్యం కాలేదు. 

అలీగఢ్ పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులు , సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ దురాగతానికిపాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వారికి బాధితురాలితో మునుపటి వివాదాలు ఉన్నాయని గుర్తించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి, వారిపై IPC సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 436 (అగ్నిప్రమాదం) , SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలి కుటుంబం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసతోంది.    "మా కూతురు ఎంత ధైర్యవంతురాలు! అగ్నిప్రమాదంలో కాలినప్పటికీ, స్కూటర్‌పై ఆసుపత్రికి వచ్చింది. కానీ మేము ఆమెను కాపాడలేకపోయాము," అని కన్నీరు మున్నీరవుతున్నారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.