Skoda Kodiaq :మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి, స్కోడా ఆటో ఇండియా షార్ట్ టెర్మ్‌ ప్రైస్‌ ప్రయోజనాలను ప్రకటించింది, ఇవి సెప్టెంబర్ 21 వరకు ఉంటాయి. ఇందులో కంపెనీకి చెందిన అనేక కార్ల పేర్లు ఉన్నాయి. ఆఫర్లలో GST తగ్గింపుతపాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి, ఇది కస్టమర్‌లకు మరింత అందుబాటులోకి వస్తుంది.

Skoda ఈ కారుపై అతిపెద్ద ఆఫర్

Skoda అత్యంత ప్రీమియం SUV కోడియాక్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ కారుపై రూ.3.3 లక్షల వరకు GST ప్రయోజనం  లభిస్తోంది. దీనికి తోడు మరో రూ.2.5 లక్షల వరకు ఆఫర్‌ కూడా పొందవచ్చు. ఈ విధంగా, మీరు రూ.6 లక్షల వరకు ప్రయోజనం పొందబోతున్నారు. స్కోడా కార్లను కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్న కస్టమర్‌లకు ఈ ఆఫర్‌లు చాలా ఆకట్టుకోనుంది.

Skoda Kodiaq పవర్

స్కోడా కోడియాక్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 190 hp పవర్‌ని జనరేట్ చేస్తుంది. 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌తో 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ అమర్చారు. స్కోడా కోడియాక్ రెండో తరం మోడల్ స్పోర్ట్‌లైన్, L&Kతో సహా రెండు వేరియంట్‌లతో మార్కెట్‌లో లభిస్తుంది.

స్కోడాకు చెందిన ఈ ప్రీమియం కారు లగ్జరీ ఫీచర్లతో వస్తుంది. అందుకే ఇది ఖరీదైన కారుగా గుర్తింపు పొందింది. స్కోడా కోడియాక్ సెకండ్ జనరేషన్ మోడల్‌లో స్పోర్ట్‌లైన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.46.89 లక్షలు, L&K వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.48.6 లక్షలు. 

ఇటీవల, Skoda Kodiaq మౌంట్ ఎవరెస్ట్ ఉత్తర బేస్ క్యాంప్‌కు చేరుకున్న భారతదేశపు మొట్టమొదటి పెట్రోల్ SUVగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ అద్భుతమైన ఘనతకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తింపునిచ్చాయి.

హైదరాబాద్‌లో ఈఎంఐపై తీసుకోవాలంటే ఎంత డౌన్ పేమేమెంట్ చెల్లించాలి

హైదరాబాద్‌లో ఈ స్కోడా కోడియాక్‌ ఆన్‌రోడ్ ప్రైస్‌ రూ. 46.89  నుంచి 49.24 మధ్య ఉంది. మీరు దీన్ని ఈఎంఐపై తీసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా 5,79,000 రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. తర్వాత మిగతా అమౌంట్‌ను బ్యాంకు లోన్‌గా 9 శాతం వడ్డీకి ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలు 1,08,171 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. అదే నాలుగేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే 1,29,675 రూపాయలు చెల్లించాలి. మూడేళ్లకు తీసుకుంటే 1,65,707 రూపాయలు చెల్లించాలి.

టెన్యూర్ పెంచుకుంటూ వెళ్తే ఎక్కువ ఈఎంఐ తగ్గుతుంది కానీ మీరు బ్యాంకు కట్టే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే 93,930 రూపాయల వరకు ఈఎంఐ చెల్లించాలి. కానీ మీరు ఆరేళ్లకు 67,62,960 రూపాయలు బ్యాంకుకు చెల్లించాలి. అదే ఐదేళ్లలో 64,90,260 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అంటే అక్కడ మీకు దాదాపు మూడు లక్షల వరకు తేడా వస్తుంది. 

అదే నాలుగేళ్ల టెన్యూర్ అయితే మీరు చెల్లించేది 62,24,400 రూపాయలు. మూడేళ్లకు లోన్‌కు వెళ్తే 59,65,452 మాత్రమే బ్యాంకుకు చెల్లిస్తారు. మీరు తీసుకున్న 52,10,952 రూపాయలకు చెల్లించేది 59,65,452 రూపాయలు అన్నమాట. ఇప్పుడు చెప్పిన లెక్క మొత్తం ఆరు లక్షల రూపాయలు తగ్గకుండా ఉన్నప్పటి రేటు. మీరు షోరూమ్ వాళ్లతో మాట్లాడితే మరింత తగ్గే అవకాశం ఉంటుంది.