iPhone 17 Launch 2025: ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ 2025: ఐఫోన్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రానే వచ్చింది. నేడు (సెప్టెంబర్ 9, 2025)న యాపిల్ కంపెనీ Awe Dropping ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు యాపిల్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, ఆపిల్ టీవీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఈ ఈవెంట్లో యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఫోన్ సిరీస్ 17, ఐపాడ్స్ ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్స్ ప్రో 3, పలు ఇతర ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Continues below advertisement

ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series)

ఈ ఈవెంట్లో యాపిల్ కంపెనీ అతిపెద్ద ప్రకటన కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచింగ్. ఇందులో ఐఫోన్ 17 బిగ్ డిస్‌ప్లే, 24MP ఫ్రంట్ కెమెరా, ప్రోమోషన్, ఆల్వేస్- ఆన్ డిస్‌ప్లే అనే 4మోడళ్లు ఉండవచ్చు.

ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air) –  ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా- అతి సన్నని డిజైన్ ఇది. 6.6-అంగుళాల స్క్రీన్, A19 చిప్, సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది.

Continues below advertisement

ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) – ఐఫోన్ 17 ప్రోలో  కొత్త కెమెరా బార్ డిజైన్, A19 ప్రో చిప్ ఉంటుంది. 48MP టెలిఫోటో లెన్స్, సెల్ఫీల కోసం 24MP ఫ్రంట్ కెమెరా.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) - మందంగా ఫ్రేమ్, ప్రో ఫీచర్లతో పాటు పెద్ద బ్యాటరీ సపోర్ట్ మీ సొంతం.

ఆపిల్ వాచ్ సిరీస్ 11 (Apple Watch Series 11)

యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ తో పాటు కొత్త వాచ్ సిరీస్ 11 కూడా లాంచ్ చేయవచ్చు. దీని డిజైన్ అలాగే ఉంటుంది. కానీ దీనికి ఫాస్టెస్ట్ S-సిరీస్ చిప్, 5G మోడెం లభిస్తుందని అనుకుంటున్నారు. బ్లడ్ ప్రెజర్ (BP) మానిటరింగ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో ఈసారి మార్కెట్లోకి రాకపోవచ్చు.

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 (Apple Watch Ultra 3)

ఆపిల్ వాచ్ అల్ట్రా 3 పెద్ద డిస్‌ప్లే, సన్నని బెజెల్స్, కొత్త S11 చిప్ ఉంటుంది. శాటిలైట్ కనెక్టివిటీతో పాటు 5G సపోర్ట్‌ లభిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ఫీచర్ చేర్చే అవకాశం ఉంది.

ఆపిల్ వాచ్ SE 3 (Apple Watch SE 3) 

2022 తర్వాత ఆపిల్ మొదటిసారిగా తన వాచ్ SE 3ని రిఫ్రెష్ చేయనుంది. ఇది ప్లాస్టిక్ బాడీ, పెద్ద డిస్‌ప్లే, కొత్త చిప్‌ పొందవచ్చు. మెరుగైన పనితీరును ఆశిస్తున్నారు. 

ఎయిర్‌పాడ్స్ ప్రో 3 (AirPods Pro 3 

కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని H3 చిప్, హార్ట్ బీట్ చెకింగ్, తిరిగి రూపొందించిన ఛార్జింగ్ కేసుతో రానుంది

Software Updates

హార్డ్‌వేర్‌తో పాటు, ఆపిల్ iOS 26, వాచ్‌ ఓఎస్ 26, ఇతర అప్‌డేట్స్ కూడా విడుదల చేస్తుంది. వీటిని ఇప్పటికే WWDCలో చెక్ చేశారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2, కొత్త ఆపిల్ టీవీ 4K, రెండవ హోమ్‌పాడ్ మినీ లేదా అప్‌డేటెడ్ విజన్ ప్రో హెడ్‌సెట్ వంటి అదనపు ఉత్పత్తులను కార్యక్రమంలో సంస్థ ప్రదర్శించవచ్చు. వీటిని ఏడాది చివరి నాటికి ప్రారంభించవచ్చు.

భారతదేశంలో ధరలు ఎలా ఉంటాయంటే..

అనలిస్ట్ సంస్థ టెక్‌ఆర్క్ ప్రకారం, భారతదేశంలో ఐఫోన్ 17 ప్రారంభ ధర దాదాపు రూ. 86,000 ఉండవచ్చు. ఐఫోన్ 16 లాంచ్ ధర రూ. 79,900 దాదాపు 7 వేలు  ఎక్కువ. డాలర్-రూపాయి మారకం రేటు అందుకు కారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఐఫోన్ ధర ప్రతి ఏడాది సగటున 7.6% పెరుగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 5.2% తగ్గింది. 

యాపిల్ ఈవెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలితేదీ – సెప్టెంబర్ 9, 2025 ఆపిల్ ప్రధాన కార్యాలయం కుపెర్టినో, కాలిఫోర్నియా

సమయం – మంగళవారం రాత్రి 10:30 (IST)

మీరు ఈవెంట్‌ను మీ ఫోన్‌లో ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఆపిల్ టీవీ యాప్, ఆపిల్ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ వీక్షించవచ్చు.