RRB Group D Exam Date 2025: రైల్వేలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం చాలా రోజు క్రితం రైల్వే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ పరీక్ష తేదీలను ప్రకటించారు. ఆ వివరాలను ఆయా ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్స్‌లో ఉంచారు. 

నోటిఫికేషన్‌లో పేర్కొన్న రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఆ పరీక్షను నవంబర్ 17న ప్రారంభం కానుంది. ఇది డిసెంబర్‌ వరకు కొనసాగుతుంది. అప్లై చేసుకున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో విడతల వారీగా పరీక్ష చేపట్టనున్నారు. 

ప్రస్తుతం పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆర్‌ఆర్‌బీ  అభ్యర్థుల పరీక్ష కేంద్రాల వివరాలను మరికొన్ని రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది. ఎగ్జామ్‌కు పది రోజుల ముందు అంటే నవంబర్ మొదటి వారంలో ఎగ్జామ్‌ సెంటర్ వివరాలు చెబితే... అక్కడికి వారం రోజుల తర్వాత హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పెడతారు. అందుకే అభ్యర్థులు ఎప్పటికప్పడు వైబ్‌సైట్‌పై ఓ లుక్‌ వేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

32, 438 ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేస్తే దేశవ్యాప్తంగా కోటీ 8లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారందరికీ నెలరోజులకుపైగా పరీక్ష నిర్వహించేందుకు ఆర్‌ఆర్‌బీ సిద్ధమవుతోంది. 

ఎగ్జామ్‌ డేట్‌ను ఎలా చెక్ చేసుకోవాలి

ముందుగా మీరు ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

అక్కడ నోటిఫికేషన్ సెక్షన్‌లో CEN 08/2025(Level-1) అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలతో పీడీఎఫ్‌ వస్తుంది. అందులో అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. 

ఎగ్జామ్‌ ఎలా ఉంటుంది? 

ఆర్‌ఆర్‌బీ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్‌ ఎగ్జామ్‌లో మల్టిపుల్ ఛాయిస్‌ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్‌కు నాలుగు ఆప్షన్‌లు ఉంటాయి. అందులో సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పత్రంలో మ్యాథ్‌మాటిక్స్, జనర్ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్, జనరల్ సైన్స్‌, జనరల్ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌ ఉంటాయి. వందల మార్కుల ప్రశ్నా పత్రాన్ని 90 నిమిషాలల్లో పూర్తి చేయాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన అభ్యర్థులు ఈ ప్రశ్నా పత్రాన్ని 120 నిమిషాలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్క్ కట్ చేస్తారు. అందుకే తెలిసిన వాటినే టిక్‌ చేయడం ఉత్తమం.