UP Crime News: 



యూపీలో దారుణం..


యూపీలో ఓ మహిళ తల నరికేసి వేళ్లు కత్తిరించి దారుణంగా హత్య చేశారు. బందా జిల్లాలో ఈ ఘోరం వెలుగు చూసింది. తల లేని మహిళ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఓ చేతికి నాగులు వేళ్లు కత్తిరించి ఉన్నాయి. 35-40 ఏళ్ల మధ్యలో ఆమె వయసు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డెడ్‌బాడీకి కొంత దూరంలోనే తల దొరికింది. ఈ ఆధారాలు సేకరించి విచారణ చేపట్టిన పోలీసులు...మృతురాలి పేరు మాయాదేవిగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ జిల్లాకి చెందిన వ్యక్తి భార్యే ఈ మృతురాలు అని నిర్ధరించారు. వేళ్లు కత్తిరించడమే కాకుండా...ఆమె జుట్టు కూడా కత్తిరించారు. పళ్లనీ ఛిద్రం చేశారు. ప్రాథమిక విచారణలో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులనే అనుమానించారు. వెంటనే వాళ్లను పిలిపించి విచారించారు. చాలా సేపు ప్రశ్నించిన తరవాత ఈ హత్య తామే చేసినట్టు అంగీకరించారు. ఆమె భర్తతో పాటు సవితి కొడుకులు, మేనల్లుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడికి మాయా దేవి రెండో భార్య. తన కొడుకులతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించాడు. దీనిపై అందరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో రగిలిపోయిన ఆమె భర్త, కొడుకులు చామ్రా గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. గొడ్డలితో తల నరికారు. నాలుగు వేళ్లు కత్తిరించారు. ఈ హత్య కోసం వాళ్లు వాడిన కార్‌ని, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసుని ఛేదించారు. అందరినీ జైలుకి పంపిస్తామని వెల్లడించారు. 


యువతిపై పెట్రోల్ పోసి..నిప్పంటించి..


ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో ఓ దారుణం జరిగింది. ఓ గర్భిణిని కుటుంబ సభ్యులే నిప్పంటించారు. నవాడా కుర్డ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆమె శరీరం దాదాపు 70% వరకూ కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. కానీ..అక్కడ చికిత్స అందించడం కష్టమైంది. అక్కడి నుంచి మరో హాస్పిటల్‌కి పంపించి అక్కడ వైద్యం కొనసాగిస్తున్నారు. బాధితురాలి తల్లి, సోదరుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...బాధితురాలికి ఇంకా పెళ్లి కాలేదు. గ్రామంలోని ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అతడికి శారీరకంగా దగ్గరై గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. సెప్టెంబర్ 28న ఆ యువతి తల్లి, సోదరుడు ఆమెని దగ్గర్లోని అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లారు. వద్దని బతిమాలుతున్నా పెట్రోల్ చల్లారు. ఆపై నిప్పంటించారు. ఆ మంటలు తట్టుకోలేక గట్టిగా కేకలు వేసింది. ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు గుర్తించి ఆమెని ఆసుపత్రికి తరలించారు. నిందితులిద్దరిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. వరుస దారుణాలు స్థానికులను వణికించాయి. 


Also Read: లిప్‌స్టిక్‌లు పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్‌లు ఎందుకు - ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు